Site icon Prime9

Skoda Kylaq Sales: చిగురిస్తున్న ఆశలు.. పెరుగుతున్న స్కోడా కైలాక్ డిమాండ్.. ఎంత మంది కొన్నారంటే..?

Skoda Kylaq Sales

Skoda Kylaq Sales

Skoda Kylaq Sales: స్కోడా ఆటో ఇండియా ప్రముఖ కార్ల తయారీ సంస్థ. కైలాక్ దేశీయ మార్కెట్లో కంపెనీ విక్రయించే ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మంచి సంఖ్యలో అమ్ముడవుతోంది. ఇటీవల, ప్రధాన ఆటోమేకర్లు ఫిబ్రవరి నెలలో తమ కార్ల విక్రయ గణాంకాలను విడుదల చేశారు. ముఖ్యంగా టాప్ 10 కాంపాక్ట్ SUVల జాబితాలో స్కోడా కైలాక్ పదవ స్థానంలో నిలిచింది. 21,461 యూనిట్ల విక్రయాలతో మారుతి సుజుకి ఫ్రాంక్స్ అగ్రస్థానంలో ఉంది.

గత నెలలో (ఫిబ్రవరి – 2025), స్కోడా కంపెనీ సుమారు 3,636 యూనిట్ల కైలాక్ కార్లను విక్రయించింది. అదే జనవరిలో విక్రయించిన 1,242 యూనిట్లతో పోలిస్తే, ఇది నెలవారీగా మంచి వృద్ధి. డిసెంబర్ 2024లో ప్రారంభించిన ఈ కారు కోసం 20,000 మంది కస్టమర్‌లు బుకింగ్‌లు చేసుకున్నారు. ప్రస్తుతం దేశీయ విపణిలో స్కోడా కైలాక్ ఎస్‌యూవీ ధర కనిష్టంగా రూ.7.89 లక్షలు, గరిష్టంగా రూ.14.40 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఈ కారు వెలుపలి భాగం కూడా మరింత అధునాతన డిజైన్‌లో ఉంటుంది ముఖ్యాంశాలలో స్ప్లిట్ LED హెడ్‌లైట్లు, స్లిమ్డ్-డౌన్ గ్రిల్, సిల్వర్ ఫాక్స్ బాష్ ప్లేట్ ఉన్నాయి. స్కోడా కైలాక్‌లో శక్తివంతమైన 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇందులో 6-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్నాయి. ఇది 15 నుండి 18 kmpl మైలేజీని ఇస్తుంది.

కైలాక్‌లో ఐదు సీట్లు ఉంటాయి. ప్రయాణికులు హాయిగా ప్రయాణించవచ్చు. హాలిడే ట్రిప్పుల కోసం ఎక్కువ లగేజీని తీసుకువెళ్లడానికి 446 కెపాసిటీ గల బూట్ స్పేస్‌ అందించారు. బ్రిలియంట్ సిల్వర్, లావా బ్లూ, ఆలివ్ గోల్డ్, కార్బన్ స్టీల్‌తో సహా వివిధ రంగుల ఎంపికలలో కూడా అందుబాటులో ఉంది.

కొత్త కారులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (10-అంగుళాల), డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (8-అంగుళాల), ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, సన్‌రూఫ్, కీలెస్ ఎంట్రీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ప్రయాణీకులకు గరిష్ట రక్షణను అందిస్తుంది.

భద్రతా ఫీచర్స్‌లొ 6-ఎయిర్‌బ్యాగ్స్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, చైల్డ్ సీట్ మౌంట్‌లు, డిస్క్/డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ మోడల్స్‌తో స్కోడా కైలాక్ ఎస్‌యూవీ పోటీపడుతుంది.

Exit mobile version
Skip to toolbar