Site icon Prime9

Nissan Magnite: నిస్సాన్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. కాస్ట్‌లీగా మారనున్న మాగ్నైట్.. ఇప్పుడు ధర ఎంతంటే..?

Nissan Magnite

Nissan Magnite

Nissan Magnite: నిస్సాన్ మోటార్ ఇండియా తన కార్లను జనవరి 2025 నుండి కాస్ట్‌లీగా చేయబోతోంది. కంపెనీ ధరలను దాదాపు 2 శాతం పెంచబోతోంది. కంపెనీ పోర్ట్‌ఫోలియో నుండి మాగ్నైట్ SUV కొనుగోలు చేయాలంటే చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మాగ్నైట్‌తో పాటు, దేశంలోని సబ్ 4-మీటర్ల విభాగంలో కంపెనీ సరసమైన SUVని కూడా కలిగి ఉంది. అంటే ఈ ఎస్‌యూవీపై ఇంట్రడ్యూస్ ఆఫర్ అక్టోబర్ 31తో ముగుస్తుంది. ఈ SUV  ప్రారంభ ధర రూ. 5.99 లక్షలు. ఇప్పుడు కంపెనీ దాని ధరను 2 శాతం పెంచినట్లయితే మాగ్నైట్ కొనడానికి రూ 12 వేల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

నిస్సాన్ మాగ్నైట్ ఇంజన్ గురించి మాట్లాడితే.. ఇది 1.0-లీటర్ NA పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. దీని మొదటి ఇంజన్ 71బిహెచ్‌పి పవర్, 96ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇది 5-స్పీడ్ MT లేదా 5-స్పీడ్ AMTతో ఉంటుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ MT లేదా CVTతో లభిస్తుంది. నిస్సాన్ ఈ అద్భుతమైన SUVపై 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిమీల వారంటీని అందిస్తుంది. దీనికి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ కూడా లభించింది.

దీని ఫీచర్ల గురించి చెప్పాలంటే.. వైర్‌లెస్ ఛార్జర్, 360 వ్యూ మానిటర్, కొత్త ఐ కీ, వాక్ ఎవే లాక్, రిమోట్ ఇంజన్ 60 మీటర్లలో స్టార్ట్ వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. స్వచ్ఛమైన గాలి కోసం కంపెనీ ఇందులో అధునాతన ఎయిర్ ఫిల్టర్‌ను ఏర్పాటు చేసింది. ఆటో డిమ్ ఫ్రేమ్‌లెస్ ఇన్‌సైడ్ రియర్-వ్యూ మిర్రర్ దీన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. సేఫ్టీ ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లతో సహా అనేక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. భారతదేశంలో ఇది టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్సెటర్‌తో పోటీపడుతుంది.

నిస్సాన్ తన ‘వన్ కార్, వన్ వరల్డ్’ ఫిలాసఫీని బలోపేతం చేస్తూ దక్షిణాఫ్రికాకు ఇటీవల విడుదల చేసిన కొత్త నిస్సాన్ మాగ్నైట్ SUV ఎగుమతులను ప్రారంభించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో కొత్త నిస్సాన్ మాగ్నైట్ విడుదల సందర్భంగా, చెన్నైలోని నిస్సాన్ అలయన్స్ జెవి ప్లాంట్ నుండి అంతర్జాతీయ మార్కెట్ కోసం తయారీని ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ విధంగా కొత్త నిస్సాన్ మాగ్నైట్‌ను ఎగుమతి చేసిన మొదటి దేశంగా దక్షిణాఫ్రికా నిలిచింది. కంపెనీ ఒక నెలలో చెన్నై పోర్ట్ నుండి 2700 కంటే ఎక్కువ కొత్త నిస్సాన్ మాగ్నైట్‌ను ఎగుమతి చేసింది.

నిస్సాన్  ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ విజన్‌కి నిస్సాన్ మాగ్నైట్ గొప్ప ఉదాహరణ. డిసెంబర్ 2020లో ప్రారంభించినప్పటి నుండి నిస్సాన్ మాగ్నైట్ 1,50,000 కంటే ఎక్కువ యూనిట్లు విక్రయించింది. భారత, అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. కొత్త నిస్సాన్ మాగ్నైట్ తన ‘ది ఆర్క్’ ప్లాన్ కింద దేశీయ, ఎగుమతి మార్కెట్ల కోసం కొత్త వ్యూహాలకు నిస్సాన్ నిబద్ధతను ప్రతిబింబిస్తూ అక్టోబర్ 2024లో న్యూ ఢిల్లీలో ప్రారంభించింది.

Exit mobile version