Site icon Prime9

WagonR Hybrid: ఇక మైలేజ్‌నీ ఎవ్వరూ ఆపలేరు.. వ్యాగన్ ఆర్ హైబ్రిడ్ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే..?

WagonR Hybrid

WagonR Hybrid

WagonR Hybrid: మారుతి సుజికి హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ ఆర్ భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు. ఈ వెహికల్ అమ్మకాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. వ్యాగనన్ ఆర్ చాలా కాలంగా బెస్ట్ సెల్లర్‌గా ఉంది. అయితే ఇప్పుడు ఈ కారు కొత్త అవతార్‌లో త్వరలో లాంచ్ కానుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, వ్యాగన్ ఆర్ ఇప్పుడు హైబ్రిడ్ ఇంజన్‌తో రోడ్లపైకి రానుంది. అయితే ఇది మొదటగా జపనీస్ కార్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఆ తర్వాత భారత్‌లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో దీనిలో ఎటువంటి ఫీచర్స్ ఉంటాయి? ప్రత్యేకత ఏమిటి? తదితర వివరాలు తెలుసుకుందాం.

WagonR Hybrid Engine
నివేదికల ప్రకారం, ఖర్చులను తగ్గించడానికి, ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి, కొత్త వ్యాగన్‌ఆర్‌లో 660cc 3 పెట్రోల్ ఇంజన్‌ అందించనున్నారు. ఈ ఇంజన్ 54పిఎస్ పవర్, 58ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంకా, ఎలక్ట్రిక్ మోటార్ 10పిఎస్ పవర్, 29 ఎన్ఎమ్ టార్క్ అందించగలదు. దీన్నిఆటో గేర్ షిఫ్ట్‌కి కనెక్ట్ చేయచ్చు. అయితే ఈ కారు భారత్‌కు వస్తే 1.2-లీటర్, 3-సిలిండర్ల హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది. ఈ Z12E ఇంజన్ కూడా 35 kmpl మైలేజీతో మంచి పనితీరును ఇస్తుంది.

WagonR Hybrid Features And Price
కొత్త-తరం వ్యాగన్ఆర్ పొడవు 3,395 మిమీ, వెడల్పు 1,475 మిమీ,ఎత్తు 1,650 మిమీ. మీడియా నివేదికల ప్రకారం, ఈ హ్యాచ్‌బ్యాక్ వీల్‌బేస్ 2,460 మిమీ, దాని మొత్తం బరువు 850 కిలోలు. కొత్త వ్యాగన్ ఆర్ హైబ్రిడ్ ఇంజన్‌ను పొందుతుంది. ఇందులో అనేక ప్రధాన మార్పులను చూడచ్చు. అంతే కాదు దీని డిజైన్‌లో కూడా మార్పులు ఉంటాయి. కొత్త వ్యాగన్ ఫుల్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కాకుండా, దాని వెనుక తలుపులు స్లైడింగ్ అవుతాయి. ఇది మాత్రమే కాదు, కారులోని అన్ని సీట్లు మునుపటి కంటే మరింత సౌకర్యవంతంగా ఉంటాయి. కొత్త ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయి. ఈ వాహనం దాదాపు రూ.10 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉండొచ్చు.

WagonR Hybrid Price
భద్రత కోసం, హైబ్రిడ్ వ్యాగన్-ఆర్‌లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, స్టాండర్డ్ 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, కొత్త వ్యాగన్ఆర్ లాంచ్ గురించి అధికారిక ధృవీకరణ ఇంకా జరగలేదు, భారతదేశంలో అత్యధికంగా ఇష్టపడే కారు. భారతదేశంలో హైబ్రిడ్ మోడల్ ధర దాదాపు రూ. 8 లక్షలు ఉండచ్చు.

Exit mobile version
Skip to toolbar