Site icon Prime9

MG Majestor: రాజకీయ నాయకులకు ఇష్టమైన కారు.. సరికొత్త MG Majestor.. ఈసారి పవర్ మాములుగా లేదు భయ్యో..!

mg majestor

mg majestor

MG Majestor: బ్రిటిష్ ఆటోమొబైల్ తయారీదారు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ త్వరలో ఎస్‌యూవీ విభాగంలో కొత్త వాహనాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కారు ఇటీవల లాంచ్ కు ముందు కనిపించింది. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం..ఈ ఎస్‌యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో వస్తుందని చెబుతున్నారు. సెల్ఫ్ అడాప్టివ్ క్రూయిజింగ్, అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఇందులో ఉంటాయి. అసలు ఈ ఎస్‌యూవీ ఎప్పుడు లాంచ్ అవుతుంది? ఎటువంటి ఫీచ్లు అందించవచ్చు? తదితర వివరాలు తెలుసుకుందాం.

 

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ త్వరలో కొత్త ఎస్‌యూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. MG Majestor తయారీదారు నుండి కొత్త ఎస్‌యూవీగా భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది. కానీ లాంచ్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారాన్ని అందించలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ఎస్‌యూవీ ఇటీవల దాని ప్రారంభానికి ముందు రోడ్లపై కనిపించింది .ఈ యూనిట్ ఏ విధంగానూ కవర్ చేయలేదు. దీని నుండి కొంత సమాచారం వెల్లడైంది. గ్లోస్టర్‌తో పోలిస్తే ఈ ఎస్‌యూవీని చాలా బోల్డ్ డిజైన్‌లో అందించే అవకాశం ఉంది.

 

MG Majestor Engine
ఈ ఎస్‌యూవీ ఇంజిన్ గురించి తయారీదారు ఇంకా ఎటువంటి సమాచారం అందించలేదు, అయితే దీనిని పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో తీసుకురావచ్చని నమ్ముతారు. ఈ పెట్రోల్ ఇంజిన్ 184 కిలోవాట్ల పవర్, 410 న్యూటన్ మీటర్ల టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది కాకుండా, ఎస్‌యూవీ టర్బో డీజిల్ ఇంజిన్ 160 కిలోవాట్ల పవర్, 500 న్యూటన్ మీటర్ల టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. రెండు ఇంజన్లతో కూడిన ఎస్‌యూవీలో 4X4 సౌకర్యం కూడా అందించే అవకాశం ఉంది. పెట్రోల్ ఇంజిన్‌తో దీని గరిష్ట వేగం 190 వరకు ఉండాగా, డీజిల్ ఇంజిన్ వేరియంట్ గరిష్ట వేగం 175 కెఎమ్‌పిహెచ్ వరకు ఉంటుంది. ఇందులో కంపెనీ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించగలదు.

 

MG Majestor Specifications
ఎంజీ మోటార్స్ మెజెస్టర్‌లో అనేక గొప్ప ఫీచర్లు ఉంటాయి. LED హెడ్‌లైట్లు, LED DRL, ముందు భాగంలో పెద్ద గ్రిల్, 20 అంగుళాల అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్, టైప్ C USB ఛార్జింగ్ పోర్ట్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ పోర్ట్, డ్రైవింగ్ కోసం అనేక మోడ్‌లు వంటివి చూడచ్చు. దీనితో పాటు, భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ , ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, హిల్ అసిస్ట్, BSD, LCA, RCTA, DOW, సెల్ఫ్ అడాప్టివ్ క్రూయిజింగ్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటి ఫీచర్లను అందించవచ్చు.

 

MG Majestor Launch Date And Price
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ నుండి వచ్చిన ఈ ఎస్‌యూవీని 2025 జనవరి 17 నుండి 22 వరకు జరిగిన ఆటో ఎక్స్‌పో 2025 సందర్భంగా భారత మార్కెట్లో అధికారికంగా ప్రవేశపెట్టారు. కానీ ధరల గురించి సరైన సమాచారం లాంచ్ సమయంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. జేఎస్‌‌డబ్ల్యూ ఎంజీ మెజెస్టర్ అంచనా ఎక్స్-షోరూమ్ ధర రూ. 40 నుండి 50 లక్షల మధ్య ఉండవచ్చు. ఈ ఎస్‌యూవీ జూన్-జూలై 2025 నాటికి భారతదేశంలో అధికారికంగా విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఇది టయోటా ఫార్చ్యూనర్ లెజెండ్స్ వంటి ఎస్‌యూవీలో నేరుగా పోటీపడుతుంది.

Exit mobile version
Skip to toolbar