Site icon Prime9

Maruti Suzuki E Vitara Crash Test: మారుతి సుజుకి మొదటి ఎలక్ట్రిక్.. క్రాష్ టెస్ట్ ఫోటోస్ వైరల్.. ఫ్యామిలీకి బెస్టేనా..!

Maruti Suzuki E Vitara Crash Test

Maruti Suzuki E Vitara Crash Test: మారుతి సుజుకి భారతదేశంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ. కంపెనీ దేశీయ విపణిలో సరికొత్త ‘ఈ-విటారా’ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గత నెలలో న్యూఢిల్లీలో ప్రారంభమైన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కూడా ఇదే కారును ప్రదర్శించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల (మార్చి)లో కొత్త ఈ-వితారాను గ్రాండ్‌గా లాంచ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్త మారుతి సుజుకి ఈ విటారా క్రాష్ టెస్ట్‌కు సంబంధించిన వివిధ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కంపెనీ ఇంకా ఈ కారును భారత్ NCAP లేదా గ్లోబల్ NCAP టెస్ట్‌కు రాలేదు. ఇది కంపెనీ స్థాయిలో జరుగుతున్న అంతర్గత పరీక్ష మాత్రమే.

మారుతి ఈ విటారా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ భారతదేశంలోనే కాకుండా అనేక విదేశీ మార్కెట్లలో విక్రయించే అవకాశం ఉన్నందున మంచి సేఫ్టీ రేటింగ్ లభిస్తుందని భావిస్తున్నారు. కొత్త కారులో ప్రయాణీకులకు మరింత రక్షణ కల్పించేందుకు గరిష్ట భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

హైలైట్‌లలో 7-ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, డిస్క్ 360 డిసి కెమెరా ఉన్నాయి.

కొత్త మారుతి సుజుకి ఈ విటారా ఎక్స్‌టీరియర్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 49 కిలోవాట్, 61 కిలోవాట్ సామర్థ్యం గల రెండు బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. ఫుల్ ఛార్జింగ్ పెడితే 500 కిలోమీటర్ల రేంజ్ (మైలేజీ) ఇవ్వగలదని చెబుతున్నారు.

ఈ కారులో అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.1-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటో ఏసీ, యాంబియంట్ లైటింగ్, 10-వే పవర్డ్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి.

కొత్త మారుతి సుజుకి ఈ-వితారా ఎస్‌యూవీ ధర రూ. 17 లక్షల నుండి రూ. 22.50 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. అదనంగా కారులో 5-సీట్ ఆప్షన్ సిస్టమ్‌ ఉంది. కాబట్టి ప్రయాణికులు సులభంగా ప్రయాణించవచ్చు. నెక్సా బ్లూ, గ్రాండియర్ గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్, ఆర్కిటిక్ వైట్, ఓపులెంట్ రెడ్, బ్లూయిష్ బ్లాక్ వంటి కలర్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

Exit mobile version
Skip to toolbar