Maruti Alto K10 Price Increase: కొన్నేళ్ల క్రితం కొత్త కారు ధర ఏడాదికి ఒకసారి పెరిగేది, ఇప్పుడు కార్ల ధరలు ప్రతి నెలా పెరుగుతున్నాయి. కార్ కంపెనీలు పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల భారాన్ని కస్టమర్ల జేబులపై మోపుతున్నాయి. మారుతి సుజుకి గత నెలలోనే తన కార్ల ధరలను 4శాతం పెంచింది.
ఇప్పుడు మరోసారి ఫిబ్రవరి నెలలో కార్ల ధరలను పెంచింది. సామాన్యుల కారుగా పిలవబడే ఆల్టో కె10 ఇప్పుడు చాలా ఖరీదైనదిగా మారింది. ఇప్పుడు ఈ కారును కొనుగోలు చేయడంలో అర్థం లేదు. ఎందుకంటే కొంచెం ఎక్కువ డబ్బుతో బెటర్ కార్లను కొనచ్చు.
Maruti Alto K10 Price
మారుతి సుజుకి చౌకైన కారు ఆల్టో K10 ఇప్పుడు రూ. 19500 వరకు పెరిగింది. ఈ పెరుగుదల దాని టాప్ వేరియంట్ VXI ప్లస్ (O)పై ఉంది. ఆ తర్వాత రూ. 5.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనచ్చు. అదే సమయంలో, ఈ కారు బేస్ వేరియంట్ ధర రూ. 4.09 లక్షల ఎక్స్-షోరూమ్ ధరగా మారింది.
ఈ కారు టాప్ మోడల్‌ను కొనుగోలు చేయడంలో అర్థం లేదు, ఎందుకంటే ఈ ధరతో మీరు కంపెనీకి చెందిన సెలెరియో, వ్యాగన్-ఆర్, స్విఫ్ట్‌లను కూడా కొనుగోలు చేయచ్చు. రెండవది, Alto K10 దాని అసలు డిజైన్‌ను కోల్పోయింది, ఇప్పుడు ఇది చెత్తగా కనిపించే చిన్న కారు. దీని ఇంజన్, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Maruti Alto K10 Features
ఆల్టో కె10లో నలుగురు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఇంజన్ గురించి చెప్పాలంటే.. కారులో 1.0లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది CNGలో కూడా అందుబాటులో ఉంది. ఈ కారు CNG మోడ్‌లో 33.85 కిమీ మైలేజీని అందిస్తుంది. ఈ కారు హ్యాండ్లింగ్, రైడ్ నాణ్యత బాగానే ఉంది. భద్రత కోసం కారులో EBD, ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఆల్టో ఒక చిన్న కుటుంబానికి మంచి కారు, కానీ అధిక ధర నిరాశపరిచింది.