Site icon Prime9

Maruti Suzuki Grand Vitara Price Hike: వామ్మో.. గ్రాండ్ విటారా ధరలు పెరిగాయి. ఇక కారు కొనడం కష్టమేనా..?

Maruti Suzuki Grand Vitara Price Hike

Maruti Suzuki Grand Vitara Price Hike

Maruti Suzuki Grand Vitara Price Hike: మారుతి సుజికి ఏప్రిల్ నుంచి తమ కార్ల ధరలను 4 శాతం వరకు పెంచింది. నిజానికి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. ప్రతి ఏడాది లాగానే ఏప్రిల్ నుంచి కొత్త కారు కొనడం ఖరీదైంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, నిర్వహణ ఖర్చులు, నియంత్రణ మార్పులు, ఫీచర్ల కారణంగా కార్ కంపెనీలు వాహనాల ధరలను పెంచాల్సి వచ్చింది. దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి కూడా తన వాహనాల ధరలను పెంచింది. మీరు మారుతి సుజికి గ్రాండ్ విటారాను కొనాలని చూస్తుంటే ఇప్పుడు ఈ కారును ఇంటికి తీసుకురావడానికి మీరు కొంచెం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.

 

భారతదేశంలో మారుతి సుజుకి కార్ల ధరలు 4శాతం పెరిగాయి. అయితే కంపెనీ గ్రాండ్ విటారా అత్యధిక ధరలను పెంచింది. ఈ వాహనం ధర రూ.62,000 పెరిగింది. మారుతి సుజుకి 3 నెలల్లో మూడోసారి ధరలను పెంచింది. ఈ ఏడాది జనవరి, మార్చి నెలల్లో కంపెనీ కార్ల ధరలను 4శాతం వరకు పెంచింది. ఇప్పుడు ఏప్రిల్‌లో మరోసారి కార్లు ఖరీదైనవిగా మారాయి. 3 నెలల్లో కార్ల ధరలు 12శాతం పెరిగాయి.

 

Maruti Suzuki Grand Vitara Price
ధర గురించి చెప్పాలంటే గ్రాండ్ విటారా ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.19 లక్షల నుండి ప్రారంభమవుతుంది. గ్రాండ్ విటారా 26 సెప్టెంబర్ 2022న దేశంలో విడుదలైంది. ఇందులో ఇన్‌స్టాల్ చేసిన హైబ్రిడ్ టెక్నాలజీ దాని ప్లస్ పాయింట్. ఇది 1462 cc, 1490 cc రెండు ఇంజన్ ఎంపికలలో వస్తుంది, ఇవి 102bhp పవర్, 137Nm టార్క్‌ను అందిస్తాయి. ఈ ఇంజన్లు 20.58, 27.97 kmpl మైలేజీని అందిస్తాయి.

 

Maruti Suzuki Grand Vitara Features
భద్రత కోసం మారుతి గ్రాండ్ వితారాలో 6-ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో కూడిన యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, స్పీడ్ అలర్ట్, పార్కింగ్ సెన్సార్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం, కారులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ వంటి స్టాండర్డ్ ఫీచర్లు ఉంటాయి. ఇందులో 5 మంది ప్రయాణించవచ్చు.

Exit mobile version
Skip to toolbar