Maruti Suzuki Fronx: భారతదేశంలో మారుతి సుజుకి కార్లకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా మారుతి ప్రీమియం కార్లు బాగా ప్రాచుర్యం పొందాయి, ముఖ్యంగా ఫ్రాంక్స్ వంటి కార్లు ప్రతి నెలా భారీ విక్రయాలను చూస్తున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి నెలలో,ఫ్రాంక్స్ మంచి అమ్మకాలను నమోదు చేసి దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ధర, సామర్థ్యం, ప్రాక్టికాలిటీ కలయికతో, ఇది కొనుగోలుదారులకు అగ్ర ఎంపికగా మరోసారి నిరూపించింది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు. ఫిబ్రవరి 2025లో 21,461 యూనిట్ల మారుతి ఫ్రాంక్స్ అమ్ముడయ్యాయి. 100 హెచ్‌పి బూస్టర్‌జెట్ టర్బో ఇంజన్‌తో నడిచే ఈ కారు హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్,టాటా నెక్సాన్ వంటి వాటికి పోటీగా నిలుస్తుంది.
దీని ధర రూ. 7.51 లక్షల నుంచి మొదలై రూ. 13.04 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. కొత్త మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎస్‌యూవీలో 1-l టర్బో పెట్రోల్, 1.2-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజన్ ఎంపికలు ఉన్నాయి. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్/ఆటోమేటిక్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్నాయి. ఈ కారు లీటర్‌పై 20.1 నుండి 28.51 kmpl వరకు మైలేజీని అందిస్తుంది.
ప్రయాణీకుల రక్షణ కోసం ఇందులో 6-ఎయిర్‌బ్యాగ్స్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, హిల్-హోల్డ్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉన్నాయి. డజన్ల కొద్దీ ఆకర్షణీయమైన ఫీచర్‌లు ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హెడ్స్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.
కొత్త ఫ్రాంక్స్ ఎస్‌యూవీ సిగ్మా, డెల్టా, జీటాతో సహా వివిధ వేరియంట్స్‌లో వస్తుంది. ఇది నెక్సా బ్లూ, ఆర్కిటిక్ వైట్, గ్రాండియర్ గ్రే వంటి అనేక వినూత్న రంగులలో కూడా అందుబాటులో ఉంది. మొత్తంమీద, ఈ కారు వెలుపల మరింత అధునాతన డిజైన్‌ను కలిగి ఉంది. డిజైన్, ఫీచర్ల కారణంగా, ఇది మంచి సంఖ్యలో అమ్ముడవుతోంది. వినియోగదారులు కూడా కొనుగోలు చేయడానికి సుముఖంగా ఉన్నారు. ఈ కారణంగా, మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫిబ్రవరి నెలలో ఎస్‌యూవీ విక్రయాలలో అపూర్వమైన వృద్ధిని సాధించింది.