Baleno Price Hiked: ఈ ఏడాది జనవరిలో తన కార్ల ధరలను 4 శాతం పెంచిన తర్వాత మారుతి సుజికి మరోసారి తన కార్ల ధరలను పెంచడం ప్రారంభించింది. మారుతి తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు బాలెనో ధరను రూ.9000 వరకు పెంచింది. కొత్త ధరలు వెంటనే అమలులోకి వచ్చాయి. మీరు కూడా బాలెనోను కొనాలని ఆలోచిస్తున్నట్లయితే దాని ఏయే వేరియంట్లపై ధరలు ఎంత పెరిగాయో తెలుసుకుందాం రండి..!
మారుతి సుజుకి బాలెనో ధర ఒక్కసారిగా పెరిగింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. దాని అన్ని వేరియంట్‌ల ధరలు పెరిగాయి. ఈ వాహనం డెల్టా GS, Zeta AGS, Alfa AGS వేరియంట్‌ల ధరలు 9000 రూపాయలు పెరిగాయి. అదే సమయంలో దాని ఇతర వేరియంట్ల ధర కూడా రూ. 5000 పెరిగింది. బాలెనో ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.70 లక్షల నుండి మొదలై రూ. 9.92 లక్షల వరకు ఉంది.
మారుతీ తన పోర్ట్‌ఫోలియోలోని అన్ని కార్ల ధరలను పెంచింది. కానీ ఈ పెరుగుదల ఏకరీతిగా చేయలేదు కానీ వివిధ వేరియంట్లలో వేర్వేరు పెరుగుదలలు చేయబడ్డాయి. అంటే బేస్ మోడల్ ధర తక్కువగా పెరిగింది, అయితే టాప్ మోడల్ ధర ఎక్కువగా పెరిగింది.
మారుతి బాలెనో ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు, ఇది టయోటా గ్లాంజా, టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20 వంటి కార్లతో నేరుగా పోటీపడుతుంది. అయితే ధర పరంగా ఇది నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ ట్రైబర్, టాటా పంచ్ వంటి SUV లకు కూడా గట్టి పోటీనిస్తుంది.
బాలెనోలో 1.2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది 89 bhp పవర్, 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. CNG మోడ్‌లో ఈ ఇంజన్ 76 bhp పవర్, 98.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు CNG మోడ్‌లో 31 km/kg మైలేజీని అందిస్తుంది.