Site icon Prime9

Mahindra BE 6-XEV 9E: రికార్డులు బ్రేక్ చేస్తున్న మహీంద్రా.. ఫిబ్రవరిలో దుమ్ములేపిన సేల్స్..!

Mahindra BE 6-XEV 9E

Mahindra BE 6-XEV 9E

Mahindra BE 6-XEV 9E: మహీంద్రా అండ్ మహీంద్రా ప్రసిద్ధ ఆటోమొబైల్ తయారీ కంపెనీగా గుర్తింపు పొందింది. కొన్ని నెలల క్రితం కంపెనీ కొత్త XEV 9e , BE 6 ఎలక్ట్రిక్ SUVలను పరిచయం చేసి విదేశీ ఎలక్ట్రిక్ కార్లకు బలమైన పోటీని ఇచ్చింది. ఈ ఫిబ్రవరిలో కంపెనీ ఈ రెండు కార్లను పెద్ద సంఖ్యలో విక్రయించింది. రండి.. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

గత నెల (ఫిబ్రవరి – 2025), XEV9E, BE6 ఎలక్ట్రిక్ SUVలు దేశీయ కస్టమర్ల నుండి విపరీతమైన స్పందనను పొందాయి. ఈ నేపథ్యంలో, కంపెనీ మొత్తం 3,196 యూనిట్ల కార్లను విక్రయించింది. గత నెలలో మహీంద్రా ఈ రెండు ఎలక్ట్రిక్ కార్ల కోసం బుకింగ్స్ తీసుకోవడం ప్రారంభించింది. ఒక్క రోజులో XEV9E, BE6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు 30,179 బుకింగ్‌లను పొందాయి. దీంతో సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర కనిష్టంగా రూ.18.90 లక్షలు, గరిష్టంగా రూ.26.90 లక్షలు ఎక్స్-షోరూమ్. ఇందులో 59 కిలోవాట్, 79 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. పూర్తి ఛార్జింగ్‌తో 535 నుండి 682 కిమీల వరకు రేంజ్ అందిస్తుంది. మహీంద్రా బీఈ6 ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌టీరియర్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 5 మంది ప్రయాణించచ్చు. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, మాగ్నెటిక్ కీ ఫాబ్‌లు, వెంటిలేటెడ్ సీట్లు , వైర్‌లెస్ ఛార్జర్‌ల కోసం డ్యూయల్ స్క్రీన్ సెటప్‌ ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్ అందించారు.

మహీంద్రా XEV 9e ఎలక్ట్రిక్ కారు ధర కనిష్టంగా రూ.21.90 లక్షలు,గరిష్టంగా రూ.30.50 ఎక్స్-షోరూమ్. 59 కిలోవాట్, 79 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. ఇది పూర్తి ఛార్జింగ్ పై 656 కి.మీల రేంజ్ (మైలేజీ) ఇస్తుంది. ఈ ఎస్‌యూవీలో కూడా 5 మంది వరకు కూర్చోవచ్చు. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ప్యాసింజర్ సైడ్ డిస్‌ప్లే కోసం 12.3-అంగుళాల స్క్రీన్, మల్టీ-జోన్ ఆటో ఏసీ, 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్‌తో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణీకుల రక్షణ కోసం 7 ఎయిర్‌బ్యాగ్స్ అందించారు.

Exit mobile version
Skip to toolbar