Site icon Prime9

Mahindra XUV 3XO: రండి బాబూ రండి.. కారు కొనండి.. భారీ డిస్కౌంట్లు ప్రకటించిన మహీంద్రా..!

Mahindra XUV 3XO

Mahindra XUV 3XO

Mahindra XUV 3XO: దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా ఏప్రిల్ 2025 నెలలో దాని వివిధ మోడళ్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. అదే క్రమంలో ఈ కాలంలో MY2024 మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులు రూ. 70,000 వరకు ఆదా చేసుకోవచ్చు. డిస్కౌంట్ గురించి మరిన్ని వివరాల కోసం కస్టమర్లు తమ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO ఫీచర్లు, పవర్‌ట్రెయిన్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.

 

మహీంద్రా XUV 3XO భారత మార్కెట్లో మొత్తం 9 వేరియంట్లలో లభిస్తుంది. మహీంద్రా XUV 3X0 లో కస్టమర్లు పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్‌ల ఎంపికను పొందుతారు. మహీంద్రా ఎక్స్‌యూవీ 3X0 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్‌కు రూ. 7.99 లక్షల నుండి రూ. 15.56 లక్షల వరకు ఉంటుంది.

 

ఫీచర్ల విషయానికొస్తే.. మహీంద్రా XUV 3XO 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీకి సపోర్ట్ ఇచ్చే 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది కాకుండా, కారు లోపలి భాగంలో అనేక ఆధునిక ఫీచర్లు కూడా అందించారు.

 

భద్రత గురించి మాట్లాడుకుంటే.. మహీంద్రా XUV 3XO లో, కస్టమర్లు 6-ఎయిర్‌బ్యాగ్‌లు, 3-పాయింట్ సీట్ బెల్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా, కారులో లెవల్-2 అడాస్ టెక్నాలజీ, 360-డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, ఫ్రంట్ రాడార్ సెన్సార్ కూడా ఉన్నాయి.

 

మరోవైపు, పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడుకుంటే, కారులో 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.2-లీటర్ టిజిడిఐ పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి. దీనితో పాటు, ఈ కారులో 1.2-లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉంది. ఇది గరిష్టంగా 115బిహెచ్‌పి పవర్, 300ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. కస్టమర్లు కారులో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండింటి ఎంపికను పొందుతారు.

Exit mobile version
Skip to toolbar