Site icon Prime9

MG Hector: ఆ మోడల్‌ కార్లపై ఎంజీ బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.2.40 లక్షల వరకూ డిస్కౌంట్స్..!

MG Hector

MG Hector: జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా పాపులర్ ఎస్‌యూవీ ఎంజీ హెక్టార్ అధిక సంఖ్యలో అమ్ముడవుతోంది. హెక్టార్ ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్ల కారణంగా పెద్ద సంఖ్యలో కస్టమర్లు దీనిని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ హెక్టర్ కారుపై భారీ తగ్గింపును ప్రకటించారు. మొత్తం రూ.2.40 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ ఆర్థిక ప్రయోజనాలు మార్చి 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ తగ్గింపుతో పాటు, పొడిగించిన వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్లు సహా పలు ప్రయోజనాలను అందిస్తుంది.

ఈ కారు ధర రూ.14 లక్షల నుండి రూ.22.89 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు అందుబాటులో ఉంది. ఇందులో స్టైల్, షైన్ ప్రో, సెలెక్ట్ ప్రో, స్మార్ట్ ప్రో, షార్ప్ ప్రో, సావీ ప్రో వంటి వేరియంట్స్ ఉన్నాయి. కారులో LED హెడ్‌లైట్లు, LED DRLలు, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, LED టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. హవానా గ్రే, క్యాండీ వైట్, గ్లేజ్ రెడ్, అరోరా సిల్వర్, స్టార్రీ బ్లాక్, డూన్ బ్రౌన్ వంటి అనేక కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.

ఎంజీ హెక్టార్ ఎస్‌యూవీలో రెండు పవర్‌ట్రెయిన్లు ఉన్నాయి. ఇందులో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 143 పిఎస్ హార్స్ పవర్, 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 6-స్పీడ్ మ్యాన్యువల్/ సీవీటీ గేర్‌బాక్స్ ఉంటుంది. మరో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 170 పిఎస్ హార్స్ పవర్, 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షనల్. లీటర్‌పై 15.58 kmpl వరకు మైలేజీని కూడా ఇస్తుంది.

ఈ కారు 5, 6, 7 సీట్ల ఎంపికలలో అందుబాటులో ఉంది. ఇతర ఫీచర్లలో 14-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 7-అంగుళాల ఫుల్-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. ప్రయాణీకుల రక్షణ కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్,ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్,టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి.

Exit mobile version
Skip to toolbar