Site icon Prime9

Hyundai Nexo: 700 కిమీ మైలేజ్.. ఇది కదా కారంటే.. హ్యుందాయ్ నెక్సో హైడ్రోజన్ ఎలక్ట్రిక్..!

Hyundai Nexo

Hyundai Nexo

Hyundai Nexo: ప్రస్తుతం దాదాపు అన్ని వాహన తయారీ కంపెనీలు హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాలను తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా.. దీని రీఛార్జ్ కూడా ఎలక్ట్రిక్ వాహనాల కంటే వేగంగా ఉంటుంది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాలు ఇంకా ప్రధాన స్రవంతి కానప్పటికీ, చాలా వాహన తయారీదారులు ఈ హైడ్రోజన్ మార్గం వైపు కదులుతున్నారు. హ్యుందాయ్ కూడా ఇందులో చేరింది. తన రెండవ తరం “Hyundai NEXO” హైడ్రోజన్ ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది. దీనిని గత సంవత్సరం అక్టోబర్‌లో చూపిన “ఇనిషియం” కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు.

 

Hyundai Nexo Electric Car
కొత్త హ్యుందాయ్ నెక్సో హైడ్రోజన్ ఎలక్ట్రిక్ కారు “ఇనిషియమ్ కాన్సెప్ట్”ని పోలి ఉంటుంది. గతేడాది అక్టోబర్‌లో దీన్ని ప్రవేశపెట్టారు. ఇందులో టోన్ డౌన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ క్యారియర్, క్వాడ్-పిక్సెల్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు ,టెయిల్‌లైట్‌లు ఉన్నాయి. కొత్త నెక్సో డిజైన్ “ఆర్ట్ ఆఫ్ స్టీల్” పై ఆధారపడి ఉంటుంది. ఇది పోంటియాక్ అజ్టెక్‌ని గుర్తుకు తెస్తుంది. ఈ డిజైన్ చాలా ఆకర్షణీయంగా చేస్తుంది. దీని బలమైన ఎస్‌యూవీ లుక్, కూల్ ఫ్యాక్టర్ దీనిని మరింత ప్రత్యేకంగా చేస్తుంది.

 

Hyundai Nexo Hydrogen Electric car
కొత్త నెక్సో‌లో డబుల్ డాష్ ఎల్ఈడీ డీఆర్ఎల్ సిగ్నేచర్, స్క్వేర్ పిక్సెల్ ఎల్ఈడీ లైటింగ్ సిగ్నేచర్, బలమైన బంపర్లు, పెద్ద అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ట్రయాంగిల్ వెనుక క్వార్టర్ గ్లాస్, రూఫ్ రెయిల్స్, సైడ్ బాడీ క్లాడింగ్‌లు వంటి డిజైన్ అంశాలు ఉన్నాయి. ఇవి ఆకర్షణీయమైన రూపాన్ని అందిస్తాయి.

 

కొత్త హ్యుందాయ్ నెక్సోలో రెండు 12.3-అంగుళాల డిస్‌ప్లేలు ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంటేషన్, రియర్‌వ్యూ కెమెరా ఫీడ్‌ను చూపించడానికి రెండు డిస్‌ప్లేలు, డిజిటల్ IRVM, 12-అంగుళాల HUD, హ్యుందాయ్ ,కియా స్లిమ్ పిల్-ఆకారపు క్లైమేట్ కంట్రోల్ స్క్రీన్ ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్‌ కోసం ట్విన్-డెక్ సెంటర్ కన్సోల్‌ ఉంది. ఇందులో 14-స్పీకర్ బ్యాంగ్, ఓలుఫ్సెన్ సౌండ్ సిస్టమ్‌ కూడా ఉంది.

 

కొత్త హ్యుందాయ్ నెక్సో హైడ్రోజన్ ఎలక్ట్రిక్ కారులో 2.64 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ బ్యాటరీ 201 బిహెచ్‌పి పవర్, ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. ఈ కారు 7.8 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. దాని బ్యాటరీని నిరంతరం రీఛార్జ్ చేయడానికి, 147 బిహెచ్‌‌పి హైడ్రోజన్ ఇంధన సెల్ స్టాక్ అందించారు. దీని పరిమాణం 6.69 కిలోలు. పూర్తిగా నిండిన తర్వాత 700 కిమీ మైలేజ్ ఇస్తుంది. హైడ్రోజన్ నింపడం కేవలం 5 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సమయం కంటే చాలా వేగంగా ఉంటుంది.

Exit mobile version
Skip to toolbar