Maruti Suzuki S-Presso: మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఒక ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్. ఫిబ్రవరి 1 నుంచి ఈ కారు ధర రూ.5,000 పెరిగింది. దీని కనిష్ట ఎక్స్-షోరూమ్ ధర రూ.4.26 లక్షలు,గరిష్టంగా రూ.6.11 లక్షలు. కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా.. అలాంటప్పుడు మారుతి ఎస్-ప్రెస్సో బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఈ కారు ఆన్-రోడ్ ధర, ఈఎమ్ఐ ఆప్షన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో వివిధ రకాల వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని స్టాండర్డ్ (O) పెట్రోల్ వేరియంట్ ధర రూ. 5.41 లక్షల వరకు ఆన్-రోడ్. రూ.2 లక్షల డౌన్ పేమెంట్ తో ఈ కారును తీసుకుంటే రూ.3.41 లక్షల వరకు లోన్ అందుతుంది. దాని కోసం 8శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలానికి రూ.7,000 వరకు నెలవారీ ఈఎమ్ఐ చెల్లించాలి.
మారుతి ఎస్-ప్రెస్సో LXI (O) వేరియంట్ ధర రూ. 6.31 లక్షల ఆన్-రోడ్. రూ.2 లక్షల డౌన్ పేమెంట్‌తో ఇంటికి తీసుకువస్తే, లోన్ మొత్తం రూ.4.31 లక్షల వరకు ఉంటుంది. 8శాతం వడ్డీ చెల్లిస్తూ, 5 సంవత్సరాల పాటు నెలకు రూ.9,000 వరకు EMI చెల్లించాలి.
కొత్త మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్ VXI (O) పెట్రోల్ వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 6.65 లక్షలు. ఈ కారును రూ.2 లక్షల డౌన్ పేమెంట్ తో తీసుకుంటే రూ.4.65 లక్షల వరకు లోన్ వస్తుంది. దాని కోసం 8శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలానికి రూ.9,500 నెలవారీ EMI చెల్లించాలి.
కొత్త ఎస్-ప్రెస్సో VXI ప్లస్ (O) పెట్రోల్ వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 7 లక్షల వరకు ఉంది. రూ.2 లక్షల డౌన్ పేమెంట్ తో కొనుగోలు చేస్తే రూ.5 లక్షల వరకు లోన్ వస్తుంది. 8శాతవ వడ్డీతో 5 సంవత్సరాల పాటు నెలకు 10,000 EMI చెల్లించాలి.
ఈ మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్క్క LXI (O) CNG వేరియంట్ ధర రూ. 7.55 లక్షల వరకు ఆన్-రోడ్. మీరు రూ.2 లక్షల డౌన్‌పేమెంట్‌తో ఈ కారును కొనుగోలు చేస్తే, లోన్ మొత్తం రూ.5.55 లక్షల వరకు ఉంటుంది. 8శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలానికి 11,000 నెలవారీ EMI చెల్లించాలి.
కొత్త మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్‌లో 1-లీటర్ పెట్రోల్, CNG ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. లీటర్‌పై 24.12 నుండి 32.73 kmpl మైలేజీని ఇస్తుంది. ఇందులో 5-సీటర్ ఆప్షన్ సిస్టమ్ కూడా ఉంది, ఇది ప్రయాణీకులు సులభంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది.
ఈ కారులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణీకుల రక్షణ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు,యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్,ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రేర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి.