Site icon Prime9

Family Scooters: ఫ్యామిలీతో స్మాల్ ట్రిప్స్​.. పెద్ద స్కూటర్లు ఇవిగో.. ఫీచర్లు మాత్రం సూపర్..!

Family Scooters

Family Scooters

Family Scooters: భారత్ మార్కెట్లోకి అనేక స్కూటర్లు వస్తున్నాయి. ఈ సెగ్మెంట్ కూడా వేగంగా విస్తరిస్తోంది.లోకల్ అవసరాలు, సిటీ పరిధిలో ఇవి ఉపయోగంగా ఉంటాయి. అందుకే వీటిని అందరూ విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విభాగంలో హీరో, సుజికి, టీవీఎస్ కంపెనీలకు చెందిన స్కూటర్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. పెద్ద సీటుతో కూడిన ఫ్యామిలీ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో 125సీసీ సెగ్మెంట్‌లో లభించే ఉత్తమ పెట్రోల్ స్కూటర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

 

Hero Destini 125
హీరో మోటోకార్ప్ కొత్త డెస్టినీ 125 స్కూటర్ మంచి ఎంపికగా మారవచ్చు. కొత్త డెస్టినీ 125ఆధునిక అనుభూతితో వస్తుంది. రైడర్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో సహా అనేక అధునాతన ఫీచర్లు ఇందులో అందించారు. ఈ స్కూటర్ మూడు వేరియంట్లలో వస్తుంది. ఈ స్కూటర్ ధర రూ.80,450 నుంచి రూ.90,300 వరకు ఉంటుంది. ఇంజన్ గురించి మాట్లాడితే.. డెస్టినీ 125లో 124.6సీసీ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 9 పిఎస్ పవర్, 10.4 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హీరో దానిని కొత్త CVT (నిరంతర వేరియబుల్ ట్రాన్స్‌మిషన్)తో అప్‌డేట్ చేసింది. డెస్టినీ 125 డిజైన్, ఫీచర్ల పరంగా బాగుంది.

 

Suzuki Access 125
Family Scootersభారతదేశంలో 125సీసీ స్కూటర్ సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్. ఈ స్కూటర్‌లో 125 సీసీ ఇంజన్ 8.7 పిఎస్ పవర్, 10 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్‌లో ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని అమర్చారు. ఇందులో పవర్‌తో పాటు మంచి మైలేజీ కూడా లభిస్తుంది. స్కూటర్ డిజైన్ చాలా సింపుల్‌‌గా ఉంటుంది. ఇది రోజువారీ ఉపయోగం కోసం మంచి ఎంపిక. యాక్సెస్ 125 ఎక్స్-షో రూమ్ ధర రూ.86 వేల నుండి ప్రారంభమవుతుంది.

 

TVS Jupiter 125
ఇది దాని విభాగంలో అత్యుత్తమంగా కనిపించే స్కూటర్. దీని సీటు కింద 32 లీటర్ల స్థలం ఉంది, ఇక్కడ మీరు 2 ఫుల్ ఫేస్ హెల్మెట్‌లను సులభంగా ఉంచుకోవచ్చు. ఈ స్కూటర్ ఎక్స్-షో రూమ్ ధర రూ. 86,405 నుండి ప్రారంభమవుతుంది. జూపిటర్ 125 ఇంజన్ గురించి మాట్లాడితే.. ఇందులో 124.8సీసీ ఇంజిన్ ఉంది. ఈ ఇంజన్ 8.3పిఎస్ పవర్,10.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Exit mobile version
Skip to toolbar