Site icon Prime9

Maruti Suzuki Alto K10 Similar Cars: ఖరీదుగా మారిన పేదోడి బండి.. రూ.6.21 లక్షలకు చేరిన మారుతి సుజుకి ఆల్టో K10 ధర.. చిన్న ఫ్యామిలీకి చక్కని కార్లు ఇవే..!

Maruti Suzuki Alto K10 Similar Cars

Maruti Suzuki Alto K10 Similar Cars

Maruti Suzuki Alto K10 Similar Cars: మారుతి సుజుకి ఆల్టో K10 ఒక ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్‌గా ప్రసిద్ధి చెందింది. దీని ధర రూ. 4.23 లక్షల నుంచి రూ. 6.21 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. దీనిలో పెట్రోల్, సీఎన్‌జీ ఇంజన్లు ఉన్నాయి. ఆల్టో 24.39 నుండి 33.85 కెఎమ్‌పిఎల్ వరకు మైలేజీని అందిస్తుంది, ఇది ఏ బైక్‌తోనూ సాటిలేనిది. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 4 నుండి 5 మంది వరకు ప్రయాణించచ్చు. ‘ఆల్టో కె10’ హ్యాచ్‌బ్యాక్‌కు ప్రత్యామ్నాయంగా ఈ 3 కార్లను కొనుగోలు చేయవచ్చు. రండి, వాటి ధర, స్పెసిఫికేషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

 

Renault KWID
ఈ కారు ధర రూ. 4.70 లక్షల నుండి రూ. 6.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. 21.46 నుండి 22.3 కెఎమ్‌పిఎల్ వరకు మైలేజీని అందిస్తుంది. కొత్త క్విడ్ హ్యాచ్‌బ్యాక్ ఎక్స్‌టీరియర్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.ఫైరీ రెడ్, మూన్‌లైట్ సిల్వర్, ఐస్ కూల్ వైట్‌తో సహా వివిధ కలర్స్‌లో లభిస్తుంది.

 

కొత్త రెనాల్ట్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్‌లో 5 సీట్లు ఉన్నాయి. ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, కీలెస్ ఎంట్రీ, మాన్యువల్ ఏసీ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్,టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌లను పొందుతుంది.

 

Tata Tiago
ఇది కూడా ఒక ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్. దీని ధర రూ. 5 లక్షల నుంచి రూ. 8.45 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. ఈ కారు పెట్రోల్, సీఎన్‌జీ ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది. 19.43 నుండి 28.06 kmpl మైలేజీని అందిస్తుంది. ఇందులో కూడా 5 మంది సులభంగా ప్రయాణించవచ్చు.

 

టాటా టియాగో ప్రిస్టైన్ వైట్, డేటోనా గ్రే, టోర్నాడో బ్లూ, సూపర్నోవా కాపర్, ఓషియానా బ్లూ, అరిజోనా బ్లూ వంటి వివిధ రంగులలో కూడా లభిస్తుంది. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్-స్టాప్ బటన్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ప్రయాణీకుల రక్షణ కోసం వెనుక పార్కింగ్ కెమెరా ఉన్నాయి.

 

Maruti Suzuki Ignis
ఆల్టో K10 కి ప్రత్యామ్నాయంగా కస్టమర్లు ఈ హ్యాచ్‌బ్యాక్‌ను కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ. 5.85 లక్షల నుంచి రూ. 8.12 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ఉంది. 20.89 kmpl మైలేజీని అందిస్తుంది.

 

ఈ మారుతి ఇగ్నిస్ కారులో 5 మంది కూర్చోవచ్చు. ఇది నెక్సా బ్లూ, లూసెంట్ ఆరెంజ్, సిల్కీ సిల్వర్, టర్కోయిస్ బ్లూ, పెర్ల్ ఆర్కిటిక్ వైట్ వంటి మల్టీ కలర్స్‌లో కూడా లభిస్తుంది. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లను అందించారు.

Exit mobile version
Skip to toolbar