Bajaj Affordable New Electric Scooter: ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతుంది. అయితే గతంలో జనాలు ఎక్కువగా పెట్రోల్ మోడళ్లను కొనేవారు. కానీ ఇప్పుడు వారి దోరణి మారింది. ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశీయ టూవీలర్ దిగ్గజం బజాజ్ కూడా ఈ సెగ్మెంట్‌పై ఎక్కువ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే గతంలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఈ స్కూటర్ దేశంలో హాట్ కేకుల్లా అమ్ముడవుతుంది.
ప్రముఖ కంపెనీలైన ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ వంటి కంపెనీలకు పోటీ నిస్తూ డిమాండ్ ఉన్న మోడల్‌గా అవతరించింది. అయితే ఇప్పుడు కంపెనీ ఈ విజయపరంపరను కొనసాగించాలని నిర్ణయించుకుంది. త్వరలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇటీవల ఈ మెడల్ పరీక్షిస్తున్న ఫోటోలు బయటకువచ్చాయి.
బజాజ్ చేతక్ ఏ విధంగా మంచి జనాదరణ సంపాదించిందో అదే విధంగా కొత్త మోడల్ కూడా సక్సెస్ అవుతుందని కంపెనీ భావిస్తుంది. కస్టమర్లను ఆకట్టుకోవడానికి అందుబాటు ధరలోనే ఈ స్కూటర్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని డిజైన్ చేతక్‌ని పోలి ఉంటుందని తెలుస్తుంది. అయితే ఫ్లోర్‌బోర్డ్ స్థలం కొంచె చిన్నదిగా ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు భాగంలో డిస్క్ ఉంది.
రైడర్ కోసం డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్స్ అందించారు. చేతక్ సిరీస్‌లో ఉన్నట్లుగానే గుండ్రటి హెడ్‌లైట్ ఉంది. దీనిలో 12-అంగుళాల వీల్స్ ఉన్నాయి. ఫోర్క్ కవర్లు ఓవల్ మిర్రర్స్ దీనికి మరింత కొత్తగా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో హబ్-మౌంటెడ్ మోటారు ఉండే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
బజాజ్ కంపెనీ పేద, మధ్య తరగతి కస్టమర్లను టార్గెట్ చేస్తుంది, ఈ క్రమంలో తన కొత్త స్కూటర్‌ను దాదాపు రూ. 80,000 ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేయచ్చని సమాచారం. తక్కువ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకొననే వారిని ఇది కచ్చితంగా ఆకట్టుకోనుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 50 కిమీ. డిజైన్ ప్రీమియంగా ఉంటుంది.
ఈ కొత్త స్కూటర్‌లో చేతక్ లైనప్‌లో కనిపించే డ్యూయల్ టెయిల్ లైట్‌కు బదులుగా సింగిల్-పాడ్ టెయిల్ లైట్ ఉంటుందని చెబుతున్నారు. మీ అవసరాల కోసం చిన్న వస్తువులను తీసుకెళ్ళడానికి ఫ్రంట్ ఆప్రాన్ హుక్ కూడా అందించారు. దీనిలో తక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్ ఉండనుంది. అలానే రేంజ్ కూడా గత మోడళ్లతో పోలిస్తే మరింత తక్కువగా ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతం టెస్టింగ్ సమయంలో కనిపించిన బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం భారతీయ వాహన మార్కెట్ ఎదురుచూస్తుంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ద్వారా ఏథర్, ఓలా ఎలక్ట్రిక్, వంటి కంపెనీలను అధిగమించి మెరుగైన సేల్స్ సాధించి ఈవీ టూవీర్ మార్కెట్‌లో మెజార్టీ వాటాను దక్కించుకోవాలని భావిస్తుంది.