Bajaj Auto E Rickshaw: బజాజ్ ఆటో భారీ ప్రకటన చేసింది. కంపెనీ ఇప్పుడు ఈ-రిక్షా మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. నిజానికి దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-రిక్షా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ-రిక్షా మార్కెట్ ప్రస్తుతం నెలవారీ 45,000 యూనిట్లుగా ఉంది. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దేశీయ ఈ-రిక్షా మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
వేగంగా అభివృద్ధి చెందుతున్న, కానీ ఎక్కువగా అసంఘటిత ఈ-రిక్షా మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ విశ్లేషకులతో మాట్లాడుతూ.. ప్రస్తుత త్రైమాసికం చివరి నాటికి కంపెనీ తన ఈ-రిక్షాకు నియంత్రణ ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు, ఇది ఈ విభాగంలోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తుంది.
ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి, ఈ విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌ని నెలకొల్పేందుకు, యజమానులకు, ప్రయాణీకులకు ఉన్నత స్థాయి సంతృప్తిని అందించే ఆధునిక ‘ఈ-రిక్షా’ని ప్రవేశపెట్టాలని మేము భావిస్తున్నాము, ఈ-రిక్షా విభాగం త్రీవీలర్ సెగ్మెంట్ అంత పెద్దదని, కొత్త ఈ-రిక్షాలను ఉత్పత్తి చేయాలని ఆయన అన్నారు.
టైమ్‌లైన్ గురించి శర్మ మాట్లాడుతూ.. “ఈ త్రైమాసికం చివరి నాటికి, అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ-రిక్షాను ప్రారంభించాలని మేము ఆశిస్తున్నాము. అప్పటికి ఇందుకు కావాల్సిన అన్ని అనుమతులు పొందుతాం. లేదంటే ఏప్రిల్ మొదటి వారంలోపు వచ్చే అవకాశం ఉంది. రిటైల్ అమ్మకాలు ఏప్రిల్ మొదటి వారంలో లేదా మార్చి చివరి నాటికి కూడా ప్రారంభమవుతాయి.
జనవరిలో ఎగుమతులతో సహా బజాజ్ ఆటో మొత్తం అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన ఏడు శాతం పెరిగి 3,81,040 యూనిట్లకు చేరుకున్నాయి. బజాజ్ ఆటో లిమిటెడ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కంపెనీ జనవరి 2024లో మొత్తం 3,56,010 వాహనాలను విక్రయించింది.
వాణిజ్య వాహనాలతో సహా మోటారు వాహనాల తయారీ కంపెనీ మొత్తం దేశీయ విక్రయాలు గత నెలలో తొమ్మిది శాతం క్షీణించి 2024 జనవరిలో 2,30,043 యూనిట్ల నుంచి 2,08,359 యూనిట్లకు పడిపోయాయి. సమీక్షలో ఉన్న నెలలో మొత్తం ఎగుమతులు 37 శాతం పెరిగి 1,72,681 వాహనాలకు చేరుకున్నాయని, జనవరి 2024లో 1,25,967 యూనిట్లు నమోదయ్యాయని కంపెనీ తెలిపింది.