Home /Author anantharao b
తెలంగాణలో అమరుల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయో ఆలోచించి ఓటు వేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో జరిగిన బహిరంగసభలో ఆమె ప్రసంగించారు.
ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఇవాళ హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణించారు. HICC లో రియల్ ఎస్టేట్ సమ్మిట్‌లో పాల్గొన్న అనంతరం రాయదుర్గంనుంచి బేగంపేట వరకు మెట్రోలో ప్రయాణించారు.
చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ 9 ఎన్ 2 వైరస్ వ్యాప్తి, చిన్న పిల్లల్లో కనిపిస్తున్న శ్వాసకోశ సమస్యల వల్ల మన దేశంలో పిల్లలకి ఎలాంటి ఇబ్బందీ ఉండదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఒక అడ్వైజరీ నోట్ విడుదల చేసింది.
భారత పేస్ బౌలర్ నవదీప్ సైనీ తన స్నేహితురాలు స్వాతి అస్థానాను వివాహం చేసుకున్నాడు. అతని వివాహ చిత్రాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా స్వాతిని సైనీ పెళ్లి చేసుకున్నాడు.
మంత్రి కేటీఆర్ వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నాడంటూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో కేటీఆర్ వ్యవహార శైలిపై తీవ్రస్దాయిలో విమర్శలు గుప్పించారు. ఇక్కడ మోదీని గూండా అని తిట్టి ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకుంటారంటూ ఎద్దేవా చేసారు.
కాంగ్రెస్ నేతలపై జరుగుతున్న ఈడీ, ఐటి దాడులపై తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మరెన్ని దాడులు చేసినా రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరని రేవంత్ రెడ్డి బిఆర్ఎస్- బిజెపిని హెచ్చరించారు.
ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కార్మికులందరి ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర మరియు ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు నిరంతరం కమ్యూనికేషన్‌ను కొనసాగిస్తున్నాయి. 2 కి.మీ మేర ఉన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికుల మనోధైర్యాన్ని ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.
తిరుచిరాపల్లికి చెందిన ప్రణవ్ జ్యువెలరీ గ్రూప్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. బీజేపీని తీవ్రంగా విమర్శించే ప్రకాష్ రాజ్ (58) ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. వచ్చేవారం చెన్నైలో ఈడీ ఎదుట హాజరుకావాలని కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో రాష్ట్రాన్ని గణనీయమైన అభివృద్ది దిశగా నడిపించిందని ఐటి శాఖ మంత్రి కెటి రామారావు ( కేటీఆర్ ) చెప్పారు. గత పదేళల్లలో తెలంగాణ రూపురేఖలు ఎలా మారాయనే దానిపై ఆయన గురువారం ఐటిసి కాకతీయ హోటల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా కేటీఆర్ తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు.
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వైద్యవిజ్ఞాన సంస్థ సెక్యూరిటీ సిబ్బంది దాష్టీకంతో క్యాజువాల్టీ ముందే ఓ వ్యక్తి ప్రాణాలు వదలాల్సి వచ్చింది. తిరుపతికి చెందిన టీటీడీ ఉద్యోగి చంద్రానాయక్ తండ్రి గోపీనాయక్‌కు గుండెపోటు వచ్చింది. ఆయనని ఆటోలో స్విమ్స్‌కు తీసుకొచ్చారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆటోడ్రైవర్ సాయంతోనే క్యాజువాలిటీలోకి తీసుకెళ్లడానికి చంద్రానాయక్ ప్రయత్నించారు.