Breaking News

ఉత్తరాంధ్ర ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపించాలి.. ఎంపీ రఘురామకృష్ణంరాజు

21 st Jul 2021, UTC

ఉత్తరాంధ్రలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై అధికారులతో విచారణ జరిపించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో మంగళవారం రఘురామ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్నారు. ఉత్తరాంధ్రకు సీమ నుంచి తరలి వచ్చిన వారు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు.

ప్రత్యేక హోదాపై సీఎం ఆదేశిస్తే ఎంపీలంతా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్లమెంట్‌లో తొలిసారి వైసీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని గొంతెత్తారని గుర్తుచేశారు. బెయిల్ రద్దు చేయమని కోర్టును ఆశ్రయించడం రాజద్రోహం ఎలా అవుతుందో చెప్పాలని రఘురామ డిమాండ్ చేశారు. తన వాట్సాప్‌ చాటింగ్ బయట పెట్టాలంటున్నారని అయితే తాను సందేశం పంపించినంత మాత్రాన అది రాజద్రోహం ఎలా అవుతుందని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.  

ఏపీకి ప్రత్యేక హోదా విషయమై వైసీపీ ఎంపీలు  మంగళవారం నాడు ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం కరోనాపై చర్చ ప్రారంభించే సమయంలో వైసీపీ ఎంపీలు ఏపీకి ప్రత్యేక హోదాపై నిరసనకు దిగారు. రాజ్యసభ వెల్‌లోకి వచ్చి ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox