Breaking News

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్దిగా సురేష్ బాబు

12 th Aug 2020, UTC

ఆంధ్రప్రదేశ్ : వైఎస్సార్ సీనియర్ నాయకుడు దివంగత నేత పెనుమత్స సాంబశివరాజు కుమారుడు డాక్టర్ సూర్యనారాయణరాజు(సురేష్ బాబు)ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి సురేష్ బాబు పేరును మంగళవారం ఖరారు చేశారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో పార్టీ పురోభివృద్ధికిసాంబశివరాజు అహర్నిశలూ కృషి చేశారు.
 
అనారోగ్యంతో సోమవారం ఆయన కన్నుమూశారు. పెద్దాయన మరణంతో ఆయన కుటుంబసభ్యులను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించి, డాక్టర్ సురేష్ బాబును ఓదార్చి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే మంగళవారం ఆయన పేరును ఎమ్మెల్సీ స్థానానికి ఖరారు చేశారు. ఇప్పటికే ఈ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్ దాఖలుకు ఈ నెల 13వ తేదీ ఆఖరు. ఈ నెల 24న ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఈ స్థానం సంఖ్యాపరంగా వైఎస్సార్ సీపీకే దక్కనుంది.
 
సురేష్ బాబు, 2014 ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీచేసి ఓటమిచెందినప్పటికీ నిత్యం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. 2019 ఎన్నికల్లో తన కుమారుడికి బరిలోకి దింపాలని సాంబశివరాజు యత్నించినా సాధ్యపడలేదు. అయితే విజయనగరం జిల్లాలో జరిగిన ప్రజా సంకల్పయాత్రలో జగన్ ఆ కుటుంబా నికి తగిన గుర్తింపునిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సురేష్ బాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేసారు. మరిన్ని వార్తలు చదవండి : జగన్ ను కంట్రోల్ చేయడం మోదీకే సాధ్యం:జేసీ దివాకర రెడ్డి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox