Breaking News

ఇక్కడ కరోనా పెంచుతారు..పక్కరాష్ట్రాల్లో చికిత్స చేసుకుంటారు: దేవినేని

23 rd Jul 2020, UTC

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా ఉద్ధృతి పెరుగుతుంది.. ఇప్పటికే ఎక్కువ సంఖ్యా లో టెస్ట్ లు చేయడం.. క్వారంటైన్ బెడ్ లు ఏర్పాటు చేయడం వంటి జాగ్రత్తలు ఎన్ని తీసుకుంటున్నప్పటికీ రాష్ట్రం లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. మరో వైపు.. అధికార పక్షం పార్టీ నేతలే ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు.. ఇటీవల విజయ సాయి రెడ్డి, అంబటి రాంబాబు కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాలను వీరు ట్విట్టర్ మాధ్యమం ద్వారా ధృవీకరించారు. 
 
          అయితే.. ప్రస్తుతం వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి హైద్రాబాదు అపోలో ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటున్నారు.కాగా.. ఈ విషయమై టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శల దాడికి దిగారు. వైసీపీ నేతలు అట్టహాసంగా చేపట్టిన నిత్యావసరాల పంపిణీ, మార్కెట్ కమిటీ ప్రారంభోత్సవాలు, ఊరూ వాడా జయంతి ఉత్సవాల వల్లనే కరోనా మహమ్మారి ఎక్కువ గా వ్యాప్తి చెందిందని దేవినేని ఉమా విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ లో కట్లు తెంచి  మరీ కరోనా పోషించిన ప్రజా ప్రతినిధులు పక్క రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని... ఇదే సౌకర్యాన్ని ప్రజలకు కూడా కల్పించాలి జగన్ గారూ అంటూ.. దేవినేని ఉమా చురకలంటించారు. 
 
           కరోనా మహమ్మారి పై ముఖ్యమంత్రి జగన్ బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేసారని దేవినేని మండిపడ్డారు. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది, బ్లీచింగ్ పౌడర్ చల్లితే పోతుంది, కరోనా ఎవరికైనా వస్తుంది, పోతుంది, కరోనా కేసులు పెరుగుతూ పోతాయి, రాబోయే రోజుల్లో కరోనా రాని వారు ఎవరూ ఉండరు.. అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను..ఈరోజు ప్రజాప్రతినిధులు నిజం చేసి చూపారన్నారు.  మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏయే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారో చెప్పే ధైర్యం మీకు ఉందా? అంటూ ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి..అధికారుల దాకా ఎవరు మాస్క్ లు ధరించడం లేదని.. కరోనా నిబంధనలను వైసీపీ నేతలు పాటించడం లేదని.. అసలు కరోనా వ్యాప్తి చెందడానికి వైసీపీ నేతలే కారణమని దేవినేని ఉమా మండిపడ్డారు. మీ తప్పుల కారణం గా సామాన్యులు బాధలు పడుతున్నారని.. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ లభించడం లేదని  ఉమా ధ్వజమెత్తారు. 24 గంటల్లో 6,045 కొత్త కేసులు నమోదయ్యాయని, 65 మంది ప్రాణాలు కోల్పోయారని... మీరు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు జగన్ గారూ? అంటూ.. దేవినేని ఉమా ప్రశ్నలతో విరుచుకుపడ్డారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox