Breaking News

ముగిసిపోయిన చరిత్ర నీది బాబూ.. విజయసాయి రెడ్డి

29 th Jul 2021, UTC

Politics : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హవాలా లావాదేవీల్లో ఆరితేరిన వ్యక్తని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. గతంలో చంద్రబాబు పీఎస్ ఇంట్లో అధికారులకు దొరికిన రెండువేల కోట్ల రూపాయలు ఎక్కడివో పట్టుకోలేక పోయారని ఆయన అన్నారు. ఎల్లోమీడియా బాబుకు భజన చేయడమే కాకుండా అతని కోసం నేరాలకు కూడ పాల్పడిందన్నారు. చంద్రబాబుది ముగిసిపోయిన చరిత్రని ఎద్దేవా చేసారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసారు.

హవాలా అంటే శవాల మీద పేలాలు ఏరుకున్నంత ఈజీ బాబుకు. సీఎంగా ఉన్నప్పడు తన పీఎస్ ఇంట్లో ఇన్‌కమ్‌ ట్యాక్స్ అధికారులు గుర్తించిన 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలు, స్టీఫెన్‌సన్‌కు పంపిన 50 లక్షలు ఎక్కడివో ఇన్నేళ్ళయినా పట్టుకోలేక పోయారంటే ఎల్లో నెట్‌వర్క్‌ ఎంత గట్టిదో తెలియడం లేదూ.

ఎల్లో మీడియా బాబుకు భజన చేయడం, ప్రభుత్వం మీద విషం చిమ్మడమే కాదు, ఆయన కోసం నేరాలు చేసేందుకూ తెగబడింది. ఇది జర్నలిజం కాదని జనం ఎప్పుడో అర్థం చేసుకున్నారు. అది పక్కా వ్యాపార భాగస్వామ్యం. తమ వాడిని గద్దె ఎక్కించడం కోసం చేస్తున్న కుట్రలు ఇవన్నీ. చచ్చిన పాము మళ్లీ లేవదని తెలియదా?

అనుకుల మీడియా గాలి కొడుతుంటే పేట్రేగి పోతున్నావు కానీ, ప్రజలకు నీ పార్టీ గురించి ఫుల్ క్లారిటీ ఉంది బాబూ. పెండింగులో ఉన్న పరిషత్ ఎన్నికల కౌంటింగులో కూడా ఏలూరు ఫలితమే రిపీట్ అవుతుంది. 12కు 12 కార్పోరేషన్లు వైస్ జగన్ గారికి కానుకగా ఇచ్చారు ప్రజలు. ముగిసిపోయిన చరిత్ర నీది అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox