Breaking News

మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం..

09 th Aug 2020, UTC
మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం..
 
ఆంధ్రప్రదేశ్ : కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో మృతి చెందిన కుటుంబాలకు సీఎం వైఎస్‌ జగన్‌ రూ.50లక్షల పరిహారం ప్రకటించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.  క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని  అధికారులను ఆదేశించారు. 

విజయవాడ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఫోన్‌ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి ప్రధానికి తెలియజేశారు. ఓ ప్రైవేటు హాస్పిటల్‌ హోటల్‌ను లీజుకు తీసుకుని అందులో కరోనా పేషెంట్లు ఉంచిందని, తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

అధికారులు వెంటనే సహాయక చర్యలను చేపట్టడంతో,భారీ ప్రాణ నష్టం తప్పిందన్నారు. దురదృష్టవశాత్తూ కొంతమంది మృత్యువాత పడ్డారని మోదీకి జగన్‌ తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా ఇదివరకే అధికారులను ఆదేశించామన్నారు. బాధితులను అన్నిరకాలుగా ఆదుకుంటున్నామన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించామని ప్రధానమంత్రికి సీఎం తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox