Breaking News

సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్

14 th Jan 2022, UTC
సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్

YsJagan: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో శుక్రవారం  సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గోవులకు ప్రత్యేక పూజలు, భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలతో వైభవంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఇక్కడికి వచ్చిన అక్కచెల్లెల్లకే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలు, సోదరులు, స్నేహితులు, అవ్వాతాతలు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నానన్నారు.  ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో  దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని రాజకీయ వార్తలు చదవండి

ఫిలిప్పీన్స్ నౌకాదళానికి బ్రహ్మాస్ క్షిపణులు 374.9 మిలియన్ డాలర్ల ఒప్పందానికి ఆమోదం

 బన్నీకి ఇన్ స్టాగ్రామ్ లో 15 మిలియన్ల ఫాలోవర్స్

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox