Breaking News

మంగళగిరిలో ఓడిన లోకేశ్ ఏం చూసొచ్చారు..?

17 th Oct 2020, UTC
మంగళగిరిలో ఓడిన లోకేశ్ ఏం చూసొచ్చారు..?

ఆంధ్రప్రదేశ్ :ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీగా వర్షాలు పడ్డ సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో వైపు చేతికొచ్చిన పంట వరద పాలు కావడంతో రైతుల ఆవేదన చెప్పనలవిగా ఉంది. మరో వైపు టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాత్రం మాటల యుద్ధం నడుస్తోంది. నారా లోకేశ్, కొడాలి నాని కౌంటర్ లు వేసుకున్నారు. వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే రైతే రాజు అని కబుర్లు చెప్పారని ఇప్పుడసలు రైతే లేకుండా చేస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఆంధ్ర ప్రదేశ్ లో 11 జిల్లాల్లో దాదాపు 8వేల ఇళ్లు నీటి పాలయ్యాయని దాదాపు పదునాలుగు మంది ప్రాణాలు కోల్పోయారని. వైసీపీ ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణమని లోకేష్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్యాలెస్ నుంచి జగన్ బయటకు రావాలని వాస్తవాలను చూడాలని హితవు పలికారు. ప్రధాని మోడీ ఫోన్ చేసి చెప్పిన తరువాత వరద నష్టం పై సీఎం జగన్ సమీక్షా నిర్వహించారని ఎద్దేవా చేసారు.

అయితే నారా లోకేష్ అన్న మాటలకు వైసీపీ నేత కొడాలి నాని కౌంటర్ చేసారు. రాష్ట్రములో ప్రతిపక్ష నేత చంద్రబాబా? లోకేషా? అని ప్రశ్నించారు. మంగళగిరిలో ఓడిపోయినా లోకేష్ ఏమి చూసొచ్చారని ప్రశ్నించారు. లోకేష్ బాబుకి కళ్ళు నెత్తిమీదే ఉన్నాయని రాబోయే రోజుల్లో వాటిని కిందకి దించుతామని కొడాలి నాని కౌంటర్ వేశారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox