ఆంధ్ర ప్రదేశ్ : రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు అత్యధికంగా నమోదు అవుతున్నప్పటికీ కట్టడిలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అంటూ టీడీపీ నేత,
మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయి ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు .నిన్న10,128 కేసులు, 77 మరణాలు. కోవిడ్ కేసుల పెరుగుదలలో దేశంలో మొదటి స్థానం. యాక్టివ్ కేసులలో రెండవస్థానం. మరణాల విషయంలోనూ అగ్రభాగం. కరోనా కోసం మీరు ఖర్చు చేసిన వేలకోట్ల రూపాయలు ఎక్కడెక్కడ ఖర్చుపెట్టారు? కోవిడ్‌ను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? చెప్పండి వైఎస్ జగన్ గారు అంటూ దేవినేని ట్వీట్ చేశారు.
కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో కొందరు అధికార పార్టీ నేతలు పక్కరాష్ట్రంలోకి వెళ్లి చికిత్స తీసుకోవడంపై టీడీపీ నేత వర్ల రామయ్య తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి గారూ! మన రాష్ట్రంలో కరోనా కట్టడికి చేపట్టిన ఏర్పాట్లు ఎంత గొప్పగా ఉన్నవో ఉప ముఖ్యమంత్రి శ్రీ అoజాద్ బాషా, మంత్రి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి లేదా మన సహచరుడు శ్రీ విజయ సాయి రెడ్డి గారిని అడిగితే, వారే చెబుతారు పక్క రాష్ట్రానికి వెళ్లి వైద్యం ఎందుకు చేయించుకున్నారో అంటూ వర్ల రామయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మరికొన్ని వార్తలు : క్వారంటైన్ బాధితుల ఆక్రందనలు వినిపించడం లేదా? : దేవినేని ఉమ