Breaking News

గుణంలేని పాలకుడు కులంగొడుగు పడతాడు..!

07 th Aug 2020, UTC
గుణంలేని పాలకుడు కులంగొడుగు పడతాడు..!
 
ఆంధ్ర ప్రదేశ్ : అమరావతి రాజధానిగా కొనసాగాలని కోరుతూ పోరాటం  చేసిన రైతులు, మహిళలను పలువురు నేతలు విమర్శించడంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ "గుణంలేని పాలకుడు కులంగొడుగు పడతాడు"... "పనితనంలేని పాలకుడు ప్రాంతాల మధ్య చిచ్చుపెడతాడు"అని పెద్దలు జాషువా గారు ముందుచూపుతో కొంత మంది పాలకుల గురించి ఆనాడే వ్యాఖ్యానించారు.
 
న్యాయంకోసం, ప్రజారాధాని కోసం నడిరోడ్డులో మోకరిల్లిన తెలుగింటి అక్కాచెల్లెళ్ళను విమర్శించటం పాపం, మహాపాపం వైఎస్ జగన్ అంటూ దేవినేని ట్వీట్ చేశారు. 
 
రాజధాని కోసం ఇప్పటి వరకూ నిర్మాణాలు నిలిచిపోతే అయ్యే వృథాకు బాధ్యులెవరని మరో ట్వీట్ లో  దేవినేని ఉమ  ప్రశ్నించారు. ప్రజా రాజధానికి ఇప్పటి వరకూ పెట్టిన ఖర్చెంత అని ప్రశ్నించారు. నిర్మాణాలు నిలిచిపోతే అయ్యే వృథాకు బాధ్యులెవరు? ప్రజా రాజధానికి ఇప్పటివరకు పెట్టిన ఖర్చెంత? ఆ సొమ్మంతా ప్రజలదే, ఖజానాకు నష్టమే. 
 
ప్రజాధనం వృథా అవుతుంటే చూస్తూ ఉండలేం? ఎలా రాబట్టాలో తర్వాతి విచారణలో తెలుస్తాం. ఈ మాటలు తాడేపల్లి రాజప్రసాదానికి వినబడుతున్నాయా జగన్ గారూ? అని దేవినేని ఉమ  తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరిన్ని వార్తలు చదవండి : బెస్ట్ సీఎంగా జగన్ సీ ఓటర్ సర్వేలో నాల్గవస్దానం..!

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox