Breaking News

బాబుది ఎప్పటికీ ఈవెంట్ మేనేజర్ స్థాయే.. విజయసాయి రెడ్డి

21 st Jul 2021, UTC

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిలో పరివర్తన అంటూ రాలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి  ట్విటర్ లో విమర్శించారు. వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నవాడు మ్యానిప్యులేటర్ అవుతాడు తప్ప నాయకుడు కాలేడని ఎద్దేవా చేసారు.

ఆరేళ్ల తర్వాత మళ్ళీ అదే తరహా కుట్రకు పాల్పడ్డాడు. అప్పట్లో మన వాళ్లు బ్రీఫుడ్ మీ అని భరోసా ఇవ్వడాన్ని ఎవరూ మర్చి పోలేదు. నెట్లో అత్యధికంగా షేర్ అయిన ఆడియో క్లిప్‌గా రికార్డు సృష్టించింది ఆ సంభాషణ. అయినా కించిత్తు పరివర్తన లేదు. ఎప్పుడు మారతాడు అనేది “మిలియన్ యూరోల” ప్రశ్న.

ప్రజల మధ్య నుంచి వాళ్ల అభిమానంతో వచ్చేవాడు నాయకుడు. వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నవాడు మ్యానిప్యులేటర్ అవుతాడు తప్ప జననేత కాలేడు. ఎల్లో మీడియా ద్వారా నిత్యం అసత్యాలు ప్రచారం చేస్తూ, కృత్రిమ పద్ధతులతో ఇమేజి పెంచుకోవాలని చూసే బాబుది ఎప్పటికీ ఈవెంట్ మేనేజర్ స్థాయే అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox