Breaking News

మాన్సాస్ ట్రస్ట్‌ పై విజయసాయి రెడ్డి కన్ను పడింది అయ్యన్న పాత్రుడు

18 th Aug 2020, UTC

ఆంధ్ర ప్రదేశ్ : విజయమ్మను ఓడించినందుకు దేవుడు విధించిన శిక్షే హుద్ హుద్ అంటూ రాక్షస మనస్తత్వాన్ని బయటపెట్టిన వైసీపీ నాయకులు ఇప్పుడు విశాఖపై కపట ప్రేమ నటిస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. మీ ప్రేమ ఉత్తరాంధ్ర ప్రజలపై కాదు ఇక్కడి భూమిపై మాత్రమేనన్నారు. విజయనగరానికి తలమానికమైన మాన్సాస్ ట్రస్ట్‌ని చెరబట్టారని విమర్శించారు.

50 వేల కోట్ల ఆస్తులు కలిగిన ట్రస్ట్‌పై విజయసాయి కన్నుపడిందన్నారు. విశాఖలో కబ్జాలు, భూదందాల పర్వం మొదలయ్యిందని విమర్శించారు. విశాఖని విజయసాయి రియల్ ఎస్టేట్ దందాకు అడ్డాగా మార్చుకున్నారన్నారు. పట్టుబడిన వాళ్ళు తన వాళ్ళు కాదంటూ ఆయన ఇస్తున్న స్టేట్‌మెంట్ చూస్తే నవ్వొస్తోందన్నారు. అంటే పట్టుబడకుండా దందా చేస్తున్న వాళ్ళు మాత్రమే మీ వాళ్ళా అని విజయ సాయిరెడ్డిని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. మరిన్ని వార్తలు చదవండి  : ఎర్రన్నాయుడు ప్రాధేయపడ్డా ఏ పోస్టు దక్కకుండా చేసాడు:విజయసాయి రెడ్డి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox