Breaking News

మెగా స్టార్ ను కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

07 th Aug 2020, UTC

 ఆంధ్ర ప్రదేశ్ : ఏపీ  బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మర్యాద పూర్వకంగా హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు.బీజేపీ అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు మెగాస్టార్ అభినందనలు తెలిపారు. చిరంజీవి పూలమాల, శాలువాతో సత్కరించారు. తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రజా సమస్యలో పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. 2024లో ఏపీలో బీజేపీ, జనసేన పార్టీల పొత్తుతో ఉమ్మడిగా అధికారం చేపట్టాలని ఆకాంక్షించారు. 
 
పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రముఖుల్ని కలుస్తున్న సోము వీర్రాజు ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు.  అయితే త‌న మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేనాని అధ్య‌క్షుడు ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ ‌నే సోము వీర్రాజు ఇంత వ‌ర‌కు క‌ల‌వ‌లేదు. నూత‌న అధ్య‌క్షుడిగా వీర్రాజు ఎంపికైన త‌ర్వాత ప‌వ‌న్ ట్విట‌ర్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు చెప్పారే తప్ప మిత్రప‌క్ష పార్టీల నేత‌లుగా ప‌ర‌స్ప‌రం క‌లుసుకున్న దాఖ‌లాలు లేవు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా చిరంజీనిని ఆయ‌న ఇంటికి వెళ్లి క‌లుసుకోవ‌డం  గమనార్హం. మరిన్ని వార్తలు చదవండి : ఇంతకంటే గొప్ప సంతృప్తి ఇంకేముంటుంది.:మెగాస్టార్ చిరంజీవి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox