కరోనా తీవ్రం అవుతుండడం తో వారం నుంచి పది రోజుల పాటు క్వారంటైన్ లో ఉంటున్నట్లు విజయ సాయి రెడ్డి నిన్న రాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే.. అత్యవసరం అయితే తప్ప ఫోన్ లో కూడా అందుబాటులో ఉండనని ఆయన తన ట్విట్టర్ లో ప్రకటించారు.. దీనితో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చి ఉండొచ్చని అందరు భావించారు.. ఆయనకు పాజిటివ్ వచ్చిందని టిఓఐ ఆంధ్ర ప్రదేశ్ కూడా ట్విట్టర్ ఖత లో ధ్రువీకరించడం తో.. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు కోరుకుంటున్నారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా బారినపడ్డాడంటూ కధనాలు వస్తుండడం పై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత స్పందించారు. రాజకీయం గా మనం విబేధించుకున్న.. ఈ కరోనా కి అందరు ఒక్కటే అని వ్యాఖ్యానించారు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను విజయ సాయి రెడ్డి గారు..అని ఆమె ట్విట్టర్ లో పేర్కొన్నారు.. బుద్ధ వెంకన్న తో సహా పలువురు టీడీపీ నేతలు ఆయన కోలుకోవాలని ట్విట్టర్ మాధ్యమం ద్వారా పోస్ట్ లు వేశారు.
అయితే.. టీడీపీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విజయ సాయి రెడ్డి ట్వీట్ పై వ్యంగం గా విమర్శనాస్త్రాలు కురిపించింది. "క్వారంటైన్ కు వెళుతున్నా అని చెప్పుకోవడం ఎందుకు, నాకు కరోనా పాజిటివ్ అని చెప్పుకోవచ్చుగా.. వై దిస్ కొలవెరి..?" అంటూ ట్వీట్ చేసింది. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.