Breaking News

సీఎం జగన్ అద్బుతంగా పనిచేస్తున్నారు.: ఉత్తమ్ కుమార్ రెడ్డి

07 th Jul 2020, UTC

గవర్నర్‌ వ్యవస్థను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అవమానించారన్నారని, సోమేశ్‌ కుమార్‌ సీఎస్‌ పదవికి అనర్హుడని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి   విమర్శించారు. తన ఇంటి ముందు పోలీసులను పెట్టడం ఎందుకని ,ఒక్క మనిషి మూఢ నమ్మకానికి సచివాలయం కూల్చివేస్తారా అని  ఆయన ప్రశ్నించారు.

ఓ వైపు ప్రజలు కరోనా వ్యాధితో కుదేలై పోతుంటే.. మరోవైపు నాయకులు మూఢ నమ్మకాల పేరుతో వేల కోట్లతో కొత్త భవనాలు నిర్మిస్తున్నారని దుయ్యబట్టారు. సచివాలయం మన అందరి ఆస్తి అని, రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన సాగుతోందని విమర్శించారు. ఏడేళ్లకిందట పూర్తయిన భవనాలు ఇప్పుడు కూల్చడం దారుణమని, సచివాలయం కూల్చివేయడంతో ఈ రోజు బ్లాక్‌ డే అని పేర్కొన్నారు.

కరోనా నివారణలో కేసీఆర్ విఫలమయ్యారని ఉత్తమ్‌ కుమార్‌ విమర్శించారు. సచివాలయంలో ఆస్పత్రి పెడితే తప్పేంటని, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. పక్క రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఏపీలో కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చారని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులను ఎందుకు నియంత్రించడం లేదని ఉత్తమ్‌ కుమార్‌ సందేహం వ్యక్తం చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox