జాతీయ వార్తలు : దేశంలో ఎక్కడా లేనట్టుగా ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. ఈ అంశంలో కేంద్రం తన పరిధిలో రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించిందన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాజధానిపై తమ పార్టీ వైఖరిని స్ఫష్టం చేసారు.
చంద్రబాబు ప్రభుత్వ సమయంలో ఎలా ఉందో ఇప్పుడు రాష్ట్ర పరిధి అంశాలపై కేంద్రం అలానే ఉందని అంటే దీనర్థం ప్రశ్నించకూడదని కాదని వ్యాఖ్యానించారు. ఏపీకి నాలుగు రెట్లు ఉన్న యూపీకి ఒకటే రాజధానిగా లక్నో ఉందని అయినా అక్కడి నుంచి పరిపాలన సాగడం లేదా అని ప్రశ్నించారు. నాడు అమరావతి అవినీతిపై ప్రశ్నించామని ఇప్పుడు మూడు రాజధానుల అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు.