Breaking News

యూనికోడ్ పై విజయం సాధించిన

07 th Aug 2020, UTC
యూనికోడ్ పై విజయం సాధించిన

భారత్ అంటేనే, భిన్నత్వానికి ప్రతీక. అలాంటి భారత్ లో ఎన్నో భాషలు ప్రాచుర్యం లో ఉన్నాయి. ఇతర దేశాల్లో లాగ, ఎదో ఒక భాషకే భారత్ పరిమితం కాలేదు. భారత్ లో ప్రాంతీయ భాషలు ఎక్కువగానే ఉన్నాయి. వాటిల్లో తెలుగు భాష కూడా ఎంతో  పురాతనమైనది. ఈ భాష ఎంతో ప్రాచుర్యాన్ని కూడా సంపాదించుకుంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు రెండైనా, ఇక్కడి ప్రజలంతా తెలుగు తల్లి  బిడ్డలే, ఇక్కడి ప్రజల మాతృ భాష తెలుగు, తరతరాలుగా కాపాడుకొస్తున్న తెలుగుపై ఇటీవల కాలం లో అన్య భాషల దాడి ఎక్కువ అవుతోంది. ఇతర భాషల అక్షరాలను తెలుగులోకి చొప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా, వీటిపై మన తెలుగు భాష విజయం సాధించింది. అసలు, తెలుగు భాష వెనుక జరుగుతున్నా కుట్రలేంటి? తెలుగు యూనికోడ్ లోకి తమిళ అక్షరాలను ఎందుకు చొప్పించాలని చూస్తున్నారు? మన భాషను కాపాడుకోవడానికి మనమేం చెయ్యాలి?
             ప్రస్తుతం, కంప్యూటర్ వాడకం ఎక్కువ అయినా సంగతి తెలిసిందే. అయితే, తెలుగు భాష ని కూడా కంప్యూటీకరణ చేయడం కోసం యూనికోడ్ అనే ఫార్మాట్ ను ఎంచుకున్నారు.  ఈ విధానం కనిపెట్టక ముందు సంఖ్యా విధానం ద్వారా కంప్యూటర్ లో ప్రాంతీయ భాషలను టైపు చేసేవారు. కానీ, దీనివలన ఎక్కువ ఇబ్బందులు ఎదురయ్యేవి. చాలినన్ని అక్షరాలు  ఆయా భాషల్లో ఉండేవి కావు. ఈ నేపధ్యం లో ప్రతి అక్షరానికి ఓ ప్రత్యేక సంఖ్యని అందించే విధం గా యూనీకోడ్ విధానాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రోగ్రామింగ్ లో ఉన్న అన్ని ఆధునిక విధానాలకు యూనికోడ్ ప్రామాణికం గా నిలిచింది.
           అలానే,తెలుగు అక్షరాల కంప్యూటీకరణకు కూడా యూనికోడ్ ను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు యూనీకోడ్ కన్సార్టియం లో సభ్యత్వం తీసుకున్నాయి. దీనితో,తెలుగు భాషలోని అన్ని అక్షరాలకు ఓ యూనికోడ్ సంఖ్యా కేటాయించబడింది. అక్షరాలు, పొల్లులు, వాడుకలో లేని తెలుగు అక్షరాలకు కూడా కోడ్ కేటాయించబడింది. అయితే ఇందులో రెండు తమిళ అక్షరాలను తెలుగు యూనికోడ్ లో చేర్చాల్లన్న భావన ఇపుడూ విస్తృతం గా విస్తరిస్తోంది.
              సుమారు 1993 ప్రాంతం లో కంప్యూటర్లలో తెలుగు భాష వాడకం మొదలైంది.  డిటిపి అప్లికేషన్లు తయారవడం, వాటిల్లో వాడటానికి తెలుగు ఫాంట్లు రూపొందించడం వంటి అభివృద్ధి తో తెలుగు భాష కూడా పురోగమనం సాధించింది. అయితే,తెలుగు అప్పట్లో తెలుగు ఫాంట్లను వెబ్ పేజీల్లోకి చొప్పించడం కొంత కష్టసాధ్యమైనది గా ఉండేది. అంతే కాకుండా,అప్పట్లో అంతటి సాంకేతిక పరిజ్ఞానం తక్కువ గా ఉండడం వలన చదివే వారు కూడా ఎక్కువ మంది లేకపోయేవారు. అంతర్జాలం లోకి యూనీకోడ్ ఫాంట్ల  ప్రవేశం వచ్చాక.. తెలుగు వెబ్  పేజీలను రూపొందించడం సులువైపోయింది. తెలుగే కాదు,అన్ని ప్రాంతీయ భాషలను వెబ్ పేజీల్లోకి తీసుకురావడం సులభమైపోయింది.
          ఇంతటి వరకు బాగానే ఉంది. అయితే.. అసలు చిక్కు సమస్య ఇపుడే మొదలైంది. తెలుగు యూనికోడ్ ఫార్మటు లలోకి తమిళ అక్షరాలను చొప్పించాలనే ప్రతిపాదన వచ్చినప్పటినుంచి,తెలుగు భాషా ప్రియుల్లో ఆందోళన మొదలైంది. తొలుత,ఈ ప్రతిపాదనను తమిళనాడు కు చెందిన ఓ వ్యక్తి తీసుకువచ్చారు. అయితే,ఈ ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్లు,యూనీకోడ్ కన్సార్టియం ట్విట్టర్ లో ప్రకటించింది కూడా. ఏప్రిల్ 30 వ తేదీ న ట్విట్టర్ మాధ్యమం ద్వారా యూనీకోడ్ కన్సార్టియం రెండు తమిళ అక్షరాలను తెలుగు యూనికోడ్ లోకి చేర్చుతున్నట్లు ప్రకటించింది.
           యూనీకోడ్ కన్సార్టియం ప్రకటన చేసిన తరువాత, పలువురు తెలుగు భాషాభిమానులు నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. తెలుగు భాషాభిమానులు, విశ్లేషకులు, నిపుణులు,సామజిక మాధ్యమాల ద్వారా తమ నినను వ్యతిరేకతను వ్యక్తం చేస్తారు. "కంప్యూటర్ తదితరఉపకరణాల్లో భాషా వినియోగానికి సంబంధించిన సాంకేతిక పట్టికలో ఒక్కో భాషకు 128 అక్షరాలు దక్కగా, ఇప్పటికే తెలుగులో 98 వరకు వాడుకున్న కేవలం 30 అక్షరాలకు సంబంధించిన ఖాళీ మాత్రమే మిగిలి ఉంది. అందులో తమిళ అక్షరాలు చేర్చడం తెలుగు భాషకు భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి" అని ఇప్పటికే పలువురు భాషాభిమానులు ఆవేదన వ్యక్తం చేసారు.
         సరైన చర్చ జరపకుండా యూనికోడ్ ప్రతినిధులు తమిళ అక్షరాలు చేర్చడం పట్ల ఆమోదం తెలపడం పై కూడా పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసారు. యూనికోడ్ ప్రతినిధులు తీసుకున్న నిర్ణయాన్ని తెలుగు కూటమి ప్రతినిధి షేక్ రహ్మానుద్దీన్ తప్పుపట్టారు. తమిళ అక్షరాలను చొప్పించాలని తమిళనాడుకు చెందిన వినోద్ రాజన్ ప్రతిపాదన చేయగా, యూనికోడ్ ప్రతినిధులు అంగీకరించారు. ఈ విషయమై అభ్యంతరం వ్యక్తం చేస్తూ,తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), ఇతర తెలుగు ప్రముఖులు రాసిన లేఖలను, కన్సార్షియంలో తెలుగు సభ్యుడు సురేష్ కొలిచాల యూనికోడ్ కన్సార్షియం దృష్టికి తీసుకెళ్లారు. ఆ తరువాత,తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు యూనికోడ్ కన్సార్టియం ప్రకటించింది. ఇది తెలుగు భాషభిమానులందరూ ఏకమై సాధించిన విజయమని తెలుగు కూటమి ప్రతినిధులు తెలిపారు.
          అందండీ సంగతి. తెలుగువారికి ఎంత ఆప్యాయతలు ఎక్కువ అయినా,మన జోలికి వస్తే మాత్రం. చూస్తూ ఉరుకోము. మన భాషని మనం మాట్లాడదాం. మన మాతృ భాష ఉనికిని కాపాడుకుందాం. మన తెలుగుని వెలగనిద్దాం. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox