Breaking News

రాజధాని కేసు లో అనూహ్య పరిణామం..!

28 th Jul 2020, UTC
రాజధాని కేసు లో అనూహ్య పరిణామం..!
 
వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత రాజధాని ని తరలిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. రాజధాని ని అమరావతి నుంచి విశాఖ కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. అమరావతి నుంచి విశాఖ కు రాజధానిని తరలించడాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ఉద్యమం మొదలైంది. అయితే.. విపక్షాలు అడ్డుపడుతుండడం తో... ఈలోపు కరోనా మహమ్మారి విపత్తు రావడం తో.. రాజధాని తరలింపు సాధ్యం కాలేదు.. కాగా.. ఇపుడు రాజధాని విషయం లో ఊహించని మార్పు చోటు చేసుకుంది.
 
             రాజధాని తరలింపు కేసులో ఏపీ సచివాలయ ఉద్యోగులు ఇంప్లీడ్‌ పిటిషన్‌ను వేశారు. ఈ మేరకు పిటిషన్‌లో 'రాష్ట్ర రాజధాని అనేది  భూములు ఇచ్చిన రైతులు సొంత వ్యవహారం కాదు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి హక్కు. రాజధాని ఎక్కడ అనేది నిర్ణయించాల్సింది ప్రభుత్వమే కానీ రైతులు కాదు. గత ప్రభుత్వ హయాంలో 114 సార్లు భూకేటాయింపులు జరిగాయి. అప్పుడు స్పందించని ఈ సమితి ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఎందుకు అడ్డుపడుతుంది.
 
                అమరావతి రాజధానికి సంబంధించి 70 శాతం పనులు పూర్తయ్యాయనడం పూర్తిగా అవాస్తవం. కొందరి రాజకీయ నేతల రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు కాపాడడం కోసమే పిటిషన్ వేశారు. ఇందులో ఎలాంటి ప్రజాప్రయోజన ప్రజాప్రయోజనాలు లేవు. అమరావతి పరిరక్షణ సమితి కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చింది. రాజధాని తరలింపు కు అయ్యే ఖర్చు 70 కోట్ల  మాత్రమే. రాజధాని తరలింపును ఏ ఉద్యోగ సంఘం వ్యతిరేకించలేదు' అని పిటిషన్‌లో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox