బిల్డ్ ఏపీ' అని కాకుండా 'సోల్డ్ ఏపీ' అని అంటే బాగుండేదని జగన్ సర్కార్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు. అమ్మడం, అప్పు చేయడం, అధిక పన్నులు వేయడం.. ఇదే జగన్ త్రిసూత్ర పాలన అంటూ విమర్శించారు. ‘ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మొత్తం అప్పు 34.06 శాతమైంది.. దేశంలోనే ఇది అత్యధికం అని ఆయన వివరించారు.
14 మాసాల కాలంలో మద్యం, ఇసుక, సిమెంట్, ఆర్టీసీ, విద్యుత్, పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగాయన్నారు. ఆగస్ట్ 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువను ప్రభుత్వం పెంచబోతుందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక సాయం గురించి రాష్ట్ర సర్కార్ మర్చిపోయిందని వ్యాఖ్యానించారు.
మరో వైపు ఫ్యూడలిస్ట్ పాలించే ఫెడరల్ స్టేట్"గా ఏపీ ఉందని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఏపీ సర్కార్ ను తప్పుబట్టారు. 2 బిల్లులు కేంద్రానికి పంపడంలో ఎందుకింత జాప్యం జరుగుతోంది? అని ప్రశ్నించారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ నియామకంలో ఎందుకింత తాత్సారం చేస్తున్నారని నిలదీశారు. ఆర్టికల్ 243(కె) ఉల్లంఘన అక్షర సత్యమన్నారు
. బిల్లులపై ఆర్టికల్ 200, 201 ప్రకారం రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాలని, ఏపీలో అధికార పరిధి అతిక్రమణ జరుగుతోందని యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు.