Breaking News

తిరుమలలోను పెరుగుతున్న కరోనా..దర్శనాలు కొనసాగిస్తాం..: వైవి సుబ్బారెడ్డి

16 th Jul 2020, UTC

కరోనా మహమ్మారి రోజు రోజు కు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా.. ఈ సెగ శ్రీనివాసుడి సన్నిధి కి కూడా చేరింది.. తిరుమలలో కూడా కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి.. గతం లోను టీటీడీ అర్చకులకు కరోనా సోకింది. తాజాగా మరో ఎనిమిది మంది అర్చకులకు కూడా కరోనా సోకింది.. ఈ నేపధ్యం లో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేడు టీటీడీ సిబ్బంది తో భేటీ అయ్యారు.
 
               ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. తిరుమల లోను  140 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలిపారు. కరోనా పరిస్థితులతో పాటు పలు విషయాలపై ఆయన ఈ భేటీ లో చర్చించారు. ఆ తరువాత మీడియా మీట్ లో మాట్లాడారు.. ఇప్పటికే..  పోలీసులు, అర్చకులు, పోటు కార్మికులకు ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ వచ్చిందన్నారు. 70 మంది ఉద్యోగులు ఇప్పటికే కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు.. దర్శనాలు ప్రారంభించాక 140 కరోనా పాజిటివ్ కేసులు నమోదు  అయ్యాయని తెలిపారు. 
 
              శ్రీవారి ఆలయంలో దర్శనాలు కన్నా పూజా కైంకర్యాలు నిర్వహించడానికే ప్రాధ్యనత కాబట్టి అర్చకులతో చర్చించామన్నారు. అయితే.. అర్చకులు.. వసతి, భోజన సదుపాయాలు కావాలని కోరారని తెలిపారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయబోతున్నామని తెలిపారు. శ్రీవారి ఆలయంలో దర్శనాలు సంఖ్య ప్రస్తుతం పెంచే యోచన లేదని .. ప్రస్తుతం లాగానే దర్శనాలు కొనసాగిస్తామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాలు నిర్వహణపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని ఆయన స్పష్టం చేసారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox