Andhrapradesh: టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి డిప్యూటేషన్ పొడిగింపు పై ఉత్కంఠ నెలకొంది. ఆయన డిప్యుటేషన్ నేటితో ముగియనుంది. నిజానికి కేంద్ర సర్వీసుల్లో పనిచేసే అధికారులకు స్వరాష్ట్రంలో ఏడేళ్ళపాటు డిప్యూటేషన్ పై పనిచేసే అవకాశం కల్పిస్తారు. ఈ గడవు ముగియనుండటంతో ఆయన్ను తిరిగి టీటీడీలో ఎలా కొనసాగించాలనే అంశం పై ఏపీ సర్కార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ధర్మారెడ్డిని రాష్ట్ర సర్వీసులకు తీసుకుంటే కల్పించే హోదా విషయంలో సర్కార్ తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.
డిప్యుటేషన్‌ను పొడిగించాలని ధర్మారెడ్డి కేంద్రాన్ని కోరారు. అయితే దానిపై ఎలాంటి స్పందన లేదు. దీంతో డిప్యుటేషన్‌ను పొడిగించకుంటే కేంద్ర సర్వీసులకు రాజీనామా చేసే యోచనలో కూడా ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ధర్మారెడ్డిని టీటీడీలోనే కొనసాగించేందుకు ప్రయత్నాలయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. వేదిక్ యూనివర్సిటీ ఇన్ చార్జ్ వైస్ చాన్సలర్‌గా ధర్మారెడ్డి పేరుతో నిన్న గెజిట్ నోటిఫికేషన్ జారీ కావడంతో దీనికి మరింత బలం చేకూరినట్లయ్యింది. కేంద్ర సర్వీసుకు రాజీనామా చేస్తే ఇక రాష్ట్ర సర్వీసుల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. దీంతో ఆయనకు ఎలాంటి పదవి కట్టబెట్టాలనేదానిపై రాష్ట్ర సర్కార్ ఆలోచనలో పడినట్లు సమాచారం.
1991 క్యాడర్‌కు చెందిన ధర్మారెడ్డి 2019 జులై 9న కేంద్ర సేవల నుంచి రిలీవ్ అయ్యే సమయానికి హోంశాఖ సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్నారు. రిలీవ్ అయిన మరుసటి రోజు టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈమధ్య ఈవో జవహర్ రెడ్డి బదిలీ కావడంతో ధర్మారెడ్డికే పూర్తిస్థాయి ఈవో బాధ్యతలను అప్పగించారు. ధర్మారెడ్డి 2024 జూన్ 30తో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో డిప్యుటేషన్‌ను మరో రెండేళ్ళు పెంచాలని ఇప్పటికే ఆయన కేంద్రానికి విన్నవించారు. ఈ ఫైల్ ప్రస్తుతం ప్రధాని కార్యాలం దగ్గరే ఉంది. అక్కడ ఆమోదం పొందితే నిరభ్యంతరంగా టీటీడీ ఈవోగా, లేదా రాష్ట్రస్థాయిలో ఇతర అధికారిగా సేవలు కొనసాగించే అవకాశముంటుంది. ఒకవేళ కేంద్రం ఆమోదించకుంటే తప్పనిసరిగా ఆయన రాష్ట్రం నుంచి రిలీవ్ కావాల్సి ఉంటుంది. ఆయన విన్నపాన్ని కేంద్రం తిరస్కరిస్తే అవసరమైతే కేంద్ర సర్వీసులకు రాజీనామా చేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం.
గతంలోనూ కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేసే ఓ అధికారి రాజీనామా చేసి ఉమ్మడి రాష్ట్ర సర్వీసులకు వచ్చారు. ఆయనకు జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. సీనియారిటీని బట్టి ఐఏఎస్ హోదా కల్పించారు. ధర్మారెడ్డిని రాష్ట్ర సర్వీసులకు తీసుకోవాలని భావిస్తే ముందుగా ఏ క్యాడర్ ఇవ్వాలనేది నిర్ణయించాల్సి ఉంటుంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022