టీటీడీ: ఏపీ బీజేపీ నాయకురాలు సాదినేని యామిని పై కేసు నమోదు అయింది. ఆమె టీటీడీపై చేసిన వ్యాఖ్యలు తీవ్రం గా ఉన్నాయని టీటీడీ ఫిర్యాదు చేసింది. ఆమెపై టీటీడీ విజిలెన్స్ తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె వ్యాఖ్యలు టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఐపీసీ 505(2), 500 సెక్షన్ల కింద సాధినేని యామినిపై పోలీసులు కేసు నమోదు చేసారు.
ఈ నెల ఐదవ తేదీన అయోధ్యలో భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ భూమి పూజ తాలూకు ప్రత్యక్ష ప్రసారాన్ని టీటీడీ తమ ఛానల్ లో ప్రసారం చేయలేదు. ఈ విషయమై సాధినేని యామిని కీలక వ్యాఖ్యలు చేసారు. ఇలా చేయడం హిందువులకు మనోవేదన కలుగచేస్తుంది అన్నారు. హిందువులు ఇచ్చే కానుకలు, దానాలతో నడిచే టీటీడీ ఇలా వ్యవహరించడం తప్పని సాధినేని యామిని అన్నారు. అయితే ఆమె వ్యాఖ్యలను టీటీడీ సీరియస్ గా తీసుకుంది.
పలువురి నుంచి ఇలాంటి విమర్శలు రావడంతో కొద్దీ రోజుల క్రితమే ఈ విషయమై టీటీడీ వివరణ ఇచ్చింది. తిరుమలలో ప్రతినిత్యం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒక్కటిన్నర గంట పాటు శ్రీవారి కల్యాణోత్సవం కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహిస్తున్నామని , అయితే అయోధ్య పూజ జరిగిన రోజు కూడా శ్రీవారి కల్యాణోత్సవం కార్యక్రమం ప్రసారం చేశామని తెలిపింది. ఆ సమయంలో ఏ ఇతర ప్రసారాలు చేయడం లేదని తెలిపింది. ఆ కార్యక్రమాన్ని కూడా మరుసటి రోజున ప్రసారం చేస్తున్నామని కూడా టీటీడీ వివరణ ఇచ్చింది. మరిన్ని వార్తలు చదవండి : ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీపికబురు..!

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
21 Apr 2021
20 Apr 2021
19 Apr 2021
21 Apr 2021