Breaking News

తిరుమలలో డిక్లరేషన్ విధానం ఎత్తేయాలి..!

22 nd Sep 2020, UTC
తిరుమలలో డిక్లరేషన్ విధానం ఎత్తేయాలి..!

ఆంధ్రప్రదేశ్ :తిరుమలలో ఇతర మతస్తులు దర్శనానికి వస్తే, తానూ స్వామి వారి పై నమ్మకంతోనే వస్తున్నానని డిక్లరేషన్ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ సంప్రదాయం శతాబ్దాల కాలం నుంచి వస్తోంది. తాజాగా ఈ విధానాన్ని ఎత్తేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని అన్నారు. వెంకటేశ్వరస్వామి భక్తుడిగా ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని కొడాలి నాని చెప్పుకొచ్చారు. ఏపీ సీఎం జగన్ ఆరు కోట్ల ఆంధ్రుల ప్రతినిధిగా తిరుమలకు వెళుతున్నారని చెప్పుకొచ్చారు.

ఏపీలో అన్ని మతాలు, కులాల వారు ఉన్నారని, కేవలం హిందువులకు ప్రతినిధిగా సీఎం జగన్ వెళ్లడం లేదని, సీఎం జగన్‌ను డిక్లరేషన్‌పై సంతకం చేయాలనడం నీచ రాజకీయమని నాని మండిపడ్డారు. సోము వీర్రాజుకు, చంద్రబాబుకు తానూ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని, తానేమి తప్పుగా మాట్లాడలేదని కొడాలి నాని సమర్ధించుకున్నారు. తానూ చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికి కట్టుబడే ఉంటున్నట్లు తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox