ఆంధ్రప్రదేశ్ : జగన్ రెడ్డి ప్రభుత్వం
రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, తిరుపతి. ఈ 4 ప్రాంతాల్లో 30 ఎకరాల చొప్పున వీఐపీ గెస్ట్‌హౌస్‌లు కడుతున్నారు. ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే తినడానికి తిండి లేకపోయినా మీసానికి సంపంగి నూనె అన్నట్లు ఉంది’ అంటూ అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై హోంమంత్రి మేకతోటి సుచరిత చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. ‘సుచరిత అసలు మీరు రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అన్న విషయం మీకు గుర్తుందా? మీరు ఒక బాధ్యత లేని వ్యక్తిగా మాట్లాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ గురించి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాస్తే మీకెందుకు బాధ? మీ నాయకులు ఎందుకు భుజాలు తడుముకున్నారు. అసలు చంద్రబాబుని విమర్శించే స్థాయి మీకుందా? రాజకీయాల్లో పొగడ్తలు, విమర్శలు రెండు ఉంటాయి. ఈ రెండింటికీ సంస్కారవంతంగా సమాధానం ఇవ్వాలి. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా దేశంలో గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు. విమర్శించడం తప్పు అనట్లేదు. కానీ విమర్శలు మితిమీరకూడదు.
మీ తోటి మంత్రులు ప్రెస్మీట్లో కూడా బూతులు తిట్టే పరిస్థితి ఉంది. దళిత యువకుడ్ని పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేశారు. డాక్టర్ సుధాకర్‌ని పిచ్చోడనే ముద్ర వేశారు. దళిత యువకుడైన కిరణ్‌ను లాఠీలతో కుళ్ల పొడిచి చంపారు. చిత్తూరులో ప్రభుత్వ మహిళా డాక్టర్‌పై వేధింపులు. గుంటూరులో ఐదు సంవత్సరాల దళిత బాలికపై అత్యాచారం. ఇంత మంది దళితలకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడని మీరు ఇప్పుడు చంద్రబాబుపై ఎలా మాట్లాడుతున్నారు. అసలు దిశ చట్టం మన రాష్ట్రంలో ఉందా?, లేదా ? అని అయ్యన్న ప్రశ్నించారు.
మరిన్ని వార్తలు చదవండి (
ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు అధ్యయన కమిటీ )