Breaking News

బాలయ్య కొడితే.. టచ్ చేసినందుకు సంతోషించిన అభిమాని..!

06 th Mar 2021, UTC

హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య అభిమానుల విషయంలో ఎంతో ప్రేమగానే ఉంటారు. అయితే, ఆయన వివాదాస్పదంగా నిలిచే అంశాల్లో ఎక్కువగా అభిమానులపై చేయి చేసుకుంటూ ఉంటారు. ఆయన ఉద్దేశపూర్వకంగా చేసుకోనప్పటికీ ఈ అంశాలు వివాదాస్పదంగా మారుతుంటాయి. 

మరో వైపు మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో మరోఘటన చోటు చేసుకుంది. హిందూపురంలో గెలుపు కోసం అవిశ్రాంతంగా పని చేస్తున్న బాలయ్య ఓ అభిమానిపై చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా, దీనిపై ఆ అభిమాని స్పందించారు. ఆ అభిమాని తన పేరు సోము అని, బాలయ్యకి వీరాభిమానినని చెప్పుకున్నారు.

ఎన్నికల ప్రచారంలో నిర్విరామంగా పని చేస్తున్న బాలయ్య ప్రచారంలో భాగంగా తమ ఇంటికే వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే, తాను తెలియక, బయటి వ్యక్తి అనుకుని పక్కకు తోశారన్నారు. ఆయన విషయంలో ఆయన అభిమానులుగా ఇలాంటి చిన్న విషయాన్నీ పట్టించుకోమని సోము తెలిపారు. ప్రచారం సందర్భంగా ఒక్కరికి కూడా షాక్ హ్యాండ్ ఇవ్వని బాలయ్య తనను మాత్రం టచ్ చేసారని సంబరపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు ఈ ఘటనను రాజకీయ కోణాల్లో చూస్తున్నాయన్నారు. వీడియోను ముగిస్తూ, జై టీడీపీ, జై బాలయ్య అంటూ సోము నినాదాలు చేసారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox