Breaking News

టీడీపీ నాయకులు తుపాకీతో తమను తాము కాల్చుకోవాలి మంత్రి కొడాలి నాని

30 th Oct 2020, UTC

ఆంధ్రప్రదేశ్:  రైతులకు సంకెళ్లు వేశారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా చేతికి బేడీలు వేసుకున్నారని మంత్రి కొడాలి నాని  ఎద్దేవా చేసారు.  కరెంట్‌ చార్జీలు తగ్గించమని అడిగితే బషీర్‌‌బాగ్‌ వద్ద రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. ఇప్పుడు రైతులకు సంకెళ్లు వేశారని దేవినేని ఉమా సంకెళ్ల నాటకం ఆడుతున్నారని.. మరి అప్పుడు బషీర్‌బాగ్‌ ఘటన సమయంలో ఉమా గన్‌తో ఎందుకు కాల్చుకోలేదని ప్రశ్నించారు. దేవినేని ఉమా, టీడీపీ నాయకులు బషీర్‌బాగ్ ఘటనపై ముందు తమను తాము తుపాకీలతో కాల్చుకోవాలని మంత్రి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గుంటూరులో జరిగిన ఘటనలో రైతులు తమపై తిరగబడితే సంకెళ్లు వేశామని పోలీస్ సిబ్బంది చెప్పారని మంత్రి నాని అన్నారు. బాధ్యులపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని వెల్లడించారు. ఇక, అమరావతిలో మాత్రమే రైతులున్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో కొన్న భూముల ధరలు పడిపోయాయని రైతులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు బృందం రాద్దాంతం చేస్తోందని ఆరోపించారు.

లోకేష్‌ లాంటి వేస్ట్‌ మనిషిని మేం ఎక్కడా చూడలేదని, వరి చేనుకు, చేపల చెరువుకు తేడా తెలియని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. లోకేష్‌ ఎక్కడ తిరిగినా ఉపయోగం లేదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox