Breaking News

ఉత్తుత్తి చ‌ట్టం తెచ్చి పాలాభిషేకం చేయించుకోవ‌డంకాద‌ు.. విజయసాయి రెడ్డికి టీడీపీ నేతల కౌంటర్లు

17 th Oct 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :మహిళల భద్రతకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌ కు టీడీపీ నేతలు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ లో విజయసాయి రెడ్డిపై తన దైన శైలిలో వ్యాఖ్యానించారు. సాయిరెడ్డి గారూ మీ స‌ర్కారు ప్రారంభించిన జ‌గ‌న‌న్న మ‌హిళాభ‌క్ష‌క ప‌థకం ఒక్క‌టే కుల‌,మ‌త‌,ప్రాంతాల‌కు అతీతంగా అమ‌లు చేస్తున్నారు. ఎంపీడీవో స‌ర‌ళ‌పై కోటంరెడ్డి దాడి,ద‌ళిత వైద్యురాలు అనితారాణి ప‌ట్ల మంత్రి పెద్దిరెడ్డి అమానుష ప్ర‌వ‌ర్త‌న. టివి డిబేట్‌లో బిసి మ‌హిళా నేత మాజీ మేయ‌ర్ పంచుమ‌ర్తి అనూరాధ అంతుచూస్తామ‌ని ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు బెదిరిస్తే. వీరిని దిశ చ‌ట్టం ప్ర‌కారం శిక్షించాల్సిన‌ జగన్ గారు అభినందించ‌డం రాష్ట్ర‌మంతా చూసింది. ఇంకా ఈ ఫేకు ట్వీట్లేంటి?అన్నారు.

మరో వైపు మాజీ మంత్రి జవహర్ కూడ విజయసాయి రెడ్డిపై సెటైర్లు వేసారు. రాజ‌ధాని మ‌హిళా రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్న‌ప్పుడే మ‌హిళ‌ల ప‌ట్ల మీ చిత్త‌శుద్ధి తేలిపోయింది. ద‌ళిత డాక్ట‌ర్ అనితారాణి పిచ్చిద‌ని పేలిన‌ మంత్రి పెద్దిరెడ్డిని తాడేప‌ల్లి పిలిచి స‌న్మానించిన సీఎం గారే, ఎంపీడీవో స‌ర‌ళ‌పై దాడిచేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఫోన్‌చేసి అభినందించారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ అంటే ఉత్తుత్తి చ‌ట్టం తెచ్చి పాలాభిషేకం చేయించుకోవ‌డంకాద‌ని తెలుసుకోండి సాయిరెడ్డి గారూ అని జవహర్  ట్వీట్ చేసారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox