Breaking News

టీడీపీ నేత పట్టాభి దారుణంగా మాట్లాడారు.. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

20 th Oct 2021, UTC

టీడీపీ నేత పట్టాభి మాట్లాడింది.. చాలా దారుణ భాష అని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నవారిపై దుర్భాషలాడటం సరికాదన్నారు. పట్టాభి వ్యాఖ్యల తర్వాత ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఒక పార్టీ కార్యాలయంలో కూర్చుని ఇంత దారుణంగా మాట్లాడటం సరికాదు. ఇలాంటి భాషను సమాజంలో ఎవరూ అంగీకరించరు.

పట్టాభి మాట్లాడిన భాష గతంలో ఎన్నడూ వినలేదు.. ప్రతి ఒక్కరూ ఎథిక్స్‌ పాటించాలని సూచించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. నిన్న తనకు వాట్సప్‌ కాల్‌ వచ్చిందని, అప్పుడు పరేడ్‌ గ్రౌండ్‌లో ఉన్నాను... ఎవరు మాట్లాడుతున్నది స్పష్టంగా లేదన్నారు. నిన్న జరిగిన ఘటనలు దురదృష్టకరమన్నారు.  పట్టాభి చేసిన వ్యాఖ్యలు అన్ని పరిధులు దాటాయి. ఒక్కసారి కాదు.. పదేపదే పట్టాభి దూషణలు చేశాడు. పట్టాభి వ్యాఖ్యలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాం. గత కొన్ని రోజులుగా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తాం. దీని వెనుక ఎలాంటి కుట్ర ఉన్నా దర్యాప్తులో బయటపెడతాం. 

నిరాధార ఆరోపణలు కరెక్టు కాదని డీజీపీ అన్నారు. విజయవాడకు డ్రగ్స్‌తో ఏమాత్రం సంబంధం లేదన్నారు. అయినా కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారన్నారు. స్పష్టంగా చెప్పినా పదేపదే ఆరోపణలు సరికాదన్నారు. ఆరోపణలు చేయవద్దని చెబుతున్నాం. గుజరాత్‌లో దొరికిన డ్రగ్స్‌తో ఏపీకి సంబంధం లేదు. ఒక గ్రామ్‌ కూడా విజయవాడకు రాలేదన్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox