Breaking News

ఐదుసార్లు కరెంట్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారు.. టీడీపీ నేత కళా వెంకట్రావు

14 th Sep 2021, UTC

సీఎం జగన్ రెడ్డి విడతల వారీగా కరెంటు చార్జీలు పెంచుతూ  కరోనాతో ఉపాధి కోల్పోయి ఆర్దికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే కరెంట్ చార్జీలు పెంచబోమని పాదయాత్రలో ప్రతి ఊరు తిరుగుతూ  జగన్ చెప్పారని  గుర్తుచేశారు. కానీ ఇప్పుడు మాట తప్పి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే  ఐదుసార్లు  కరెంట్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచి మరోసారి విద్యుత్ చార్జీలు పెంచేందుకు సిద్దమయ్యారని ఆయన మండిపడ్డారు

'విద్యుత్ వంక చూస్తేనే షాక్ కొట్టేలా బిల్లులు వేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. గతంలో వంద రూపాయల బిల్లు వస్తే ఇప్పుడు వేల రూపాయల్లో బిల్లులు వస్తున్నాయి. ఉన్నదంతా ఊడ్చి బిల్లులు కడితే మహిళలు ఏ విధంగా సంసారాలు నడుపుకోవాలి అంటూ ఆయన ప్రశ్నించారు.

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే రూ.11,611 కోట్లు విద్యుత్ ఛార్జీల భారం రాష్ట్ర ప్రజలపై మోపింది. 2020 ఫిబ్రవరిలో 500 యూనిట్లు దాటిన వారిపై యూనిట్ పై (పాత రేటు రూ. 9.05 పైసలు) 90 పైసలు పెంచింది (కొత్త రేటు రూ.9.95 పైసలు) జగన్ రెడ్డి ప్రభుత్వం. ఇలా మొదటిసారి రూ.1300 కోట్ల భారం ప్రజలపై మోపారని కళా వెంకట్రావు ఆరోపించారు.

ఇక ఇదే 2020 ఏప్రిల్, మే నెలలో స్లాబులు మార్చి కరోనాతో ప్రజలకు పూట గడవడమే ఇబ్బందిగా ఉన్న పరిస్ధితుల్లలో మరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై మరో రూ. 1500 కోట్లు భారం మోపారు. 2021 ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్ ఆర్డర్ ను తీసుకొచ్చి కిలో వాట్ కు రూ.10 ఛార్జీలతో 20 శాతం ఛార్జీలను పెంచింది. స్థిర ఛార్జీలు లేవంటూనే కిలోవాట్ కు రూ. 10 వడ్డనతో 20 శాతం బిల్లులు పెంచారు. దీనితో వినియోగదారులపై దాదాపు రూ.2600 కోట్ల వరకు భారాన్ని మోపారని వెంకట్రావు అన్నారు.2019-20 లో విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు తగ్గినా ప్రభుత్వం సర్ధుబాటు (ట్రూఅప్) ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడం  దుర్మార్గమని కళా వెంకట్రావు  పేర్కొన్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox