Breaking News

సీఎం నిద్రపోతున్నారా? దేవినేని ఉమా మహేశ్వరరావు

01 st May 2021, UTC

ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, వీడియో మార్ఫింగ్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి సీఐడీ విచారణకు హాజరయ్యారు. అనంతరం ఉమ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో జే టాక్స్ పేరుతో ధాన్యం దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. సమయం అంతా దేవినేని ఉమను, ధూళిపాళ్ళ నరేంద్రను ఇబ్బంది పెట్టాలని వేచిస్తున్నారని మండిపడ్డారు.

తనను 9గంటలు సీఐడీ కార్యాలయంలో కూర్చోబెడితే ఏమి వస్తుందని ప్రశ్నించారు. ధాన్యం పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంటే సీఎం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. మంత్రులు ధాన్యం దళారుల ముసుగు కప్పుకుంటే సీఎం నిద్రపోతున్నారా అని మండిపడ్డారు. 

ధాన్యం దోపిడీ విషయంలో నాపై ఏ కేసు పెడతారో పెట్టుకోండి. రైతుల తరపున రాజమండ్రి జైల్లో ఉండటానికి నేను సిద్ధం అని దేవినేని ఉమా సవాల్ విసిరారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox