స్వర్ణ పాలస్ లో ప్రమాదం జరిగిన సంగతి విదితమే.. ఇప్పటి వరకు అక్కడ ఏడుగురు మృతి చెందారు. మరి కొందరు బాధితులు చికిత్స పొందుతున్నారు. స్వర్ణా ప్యాలెస్ హోటల్ ను ఓ ప్రైవేట్ ఆసుపత్రి వారు అద్దెకు తీసుకొని కరోనా కేర్ సెంటర్ గా వినియోగిస్తున్నారు. ఈ కరోనా కేర్ సెంటర్ లో 40 మంది కరోనా భాదితులు, 10 మాంది వైద్య సిబ్బంది ఉంటున్నారు. ఈ హోటల్ లో ప్రమాదం జరిగింది.. అసలే కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటుంటే.. వారు అగ్నిప్రమాదం భారిన పడటం చాలా బాధాకరమైన విషయం.. అని ఈ ఘటన పట్ల మేకతోటి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదం లో ఏడుగురు మృతి చెందారు..వారి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం గా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాధమికం గా తెలుస్తోందని అన్నారు. ఈ ఘటన పై అన్ని ఆధారాలను పరిశీలించాలని .. మరిన్ని సేకరించాలని.. అధికారులను హోంమంత్రి సుచరిత ఆదేశాలు జారీ చేసారు.
పోలీసులు బాధితులందరినీ లబ్బీపేట, మెట్రోపాలిటన్ హోటల్ కొవిడ్ కేర్ సెంటర్లకు తరలించారు . హోటల్లో మంటలు చెలరేగే సరికి అక్కడున్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేసింది. కరోనా బాధితులను కాపాడేందుకు పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. తమను రక్షించండి అంటూ బాధితులు కిటికీల్లో నుంచి కేకలు వేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.