Breaking News

స్వర్ణ పాలస్ లో ప్రమాదానికి కారణాలివే..!

11 th Aug 2020, UTC

విజయవాడ స్వర్ణ పాలస్ లో అగ్ని ప్రమాదం జరిగి పదకొండు మంది సజీవ దహనం అయినా సంగతి తెలిసిందే.. అయితే.. ఈ ప్రమాదానికి గల కారణాలేంటో తెలుసుకోవడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే..స్వర్ణా ప్యాలెస్ ప్రమాదంపై జిల్లా కమిటీ నివేదికలు సిద్ధమయ్యాయి.   ఫైర్, విద్యుత్, వైద్య మరియు భద్రతా కమిటీలు చర్చించి ఈ నివేదికలను సిద్ధం చేశాయి.  ఈ రోజు సాయంత్రం కలెక్టర్ ఇంతియాజ్‌కు కమిటీలు ఈ నివేదికను ఇవ్వనున్నాయి. 
         ఈ నివేదిక ప్రకారం.. స్వర్ణా ప్యాలెస్‌ లో అగ్ని ‌ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం ఇవ్వలేదు. కొంత సేపు మంటలను ఆర్పడానికి సిబ్బంది ప్రయత్నించారు.ఆ తరువాత.. ఫైర్ సిబ్బంది కి సమాచారం అందించారు. అగ్ని ప్రమాదం గుర్తించే కనీస పరికరాలు, స్మోక్ డిటెక్టర్, అలారం పని చేయకపోవడం వంటి కారణాల వలన ఎక్కువ మంది మృతి చెందినట్లు ఈ నివేదిక పేర్కొంది. రమేష్ ఆసుపత్రి, స్వర్ణా ప్యాలెస్ యజమాన్యాల నిర్లక్ష్యం కూడా ఈ ప్రమాదానికి కారణమైంది.  రమేష్ ఆసుపత్రి ప్రభుత్వ నిబంధనలు పాటించ లేదు. 
            మరో వైపు.. కరోనా రోగుల నుంచి కూడా భారీ గా ఫీజులు వసూలు చేసినట్లు ఈ నివేదికలు పేర్కొన్నాయి.  అనుమతికి మించి పేషేంట్స్‌ను  చేర్చుకున్నారని కూడా ఈ నివేదిక లో తెలిపారు. భద్రతా ప్రమాణాలు లేకపోయినా స్వర్ణా ప్యాలెస్‌లో కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు.. షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు చాలా తక్కువని ఈ నివేదిక లో పేర్కొన్నారు. అయితే..  కలప, ఫైబర్‌తో చేసిన ఇంటీరియర్ డెకరేషన్‌కు సానిటైజేషన్ వాడకం ఎక్కువగా ఉండటం వల్ల మంటలు త్వరగా వ్యాపించాయని  విద్యుత్ శాఖ కమిటీ తమ నివేదిక లో పేర్కొంది. 
         
  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox